E-Paper
Advertisement

Mohammad Kaif: అభిషేక్ శ‌ర్మకు ఎక్స్‏పైరీ డేట్ వ‌చ్చేసింది..టీమిండియా వెంట‌నే త‌ప్పించండి

Mohammad Kaif: అభిషేక్ శ‌ర్మకు ఎక్స్‏పైరీ డేట్ వ‌చ్చేసింది..టీమిండియా వెంట‌నే త‌ప్పించండి
Advertisement
Mohammad Kaif :  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో అభిషేక్ శర్మ అత్యంత దారుణంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడలేదు అభిషేక్ శర్మ. ఆసియా కప్ 2025 సమయంలో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ, ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో కూడా అదరగొట్టాడు. కానీ ICC టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటు సందర్భంగా మాత్రం అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏ ఒక్క మ్యాచ్ లో కూడా తన బ్యాటింగ్ ప్రదర్శనను కనబరచడం లేదు. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే అభిషేక్ శర్మ ( Abhishek sharma) బ్యాటింగ్ పై మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif) సీరియస్ అయ్యారు. అభిషేక్ శర్మకు ఎక్స్ పైర్ డేట్ వచ్చేసిందని… వెంటనే అతన్ని టీమిండియాలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif).

ఎక్స్ పైర్ డేట్ వచ్చేసింది… అభిషేక్ శర్మను తొలగించండి

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు సందర్భంగా అత్యంత దారుణంగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ ప్రదర్శన పై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ స్పందించారు. అభిషేక్ శర్మకు కొన్ని మ్యాచ్ ల వరకు బ్రేక్ ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. వరుసగా అతడు విఫలమవుతున్నాడు.. కాబట్టి అతనికి రెస్ట్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు మహమ్మద్ కైఫ్. ఇదేం బైలాటరల్ సిరీస్ కాదని ఫైర్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ లో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వరల్డ్ కప్ లో ప్రతి ఒక్క మ్యాచ్ చాలా కీలకంగా మారుతుంది.

అలాంటప్పుడు అభిషేక్ శర్మాను ఆడించకపోవడం బెటర్ అంటూ సూచనలు చేశారు మహమ్మద్ కైఫ్. అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్ లో లేడని చురకలు అంటించారు. తనకు వచ్చిన అవకాశం ఒక్కటి కూడా వినియోగించుకోలేదని… నాలుగు మ్యాచ్లలో అతను చేసింది 15 పరుగులు మాత్రమేనని ఫైర్ అయ్యారు. ఇన్ని అవకాశాలు వచ్చినా కూడా విఫలమవుతున్న అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వాలన్నారు. అతనికి బ్రేక్ ఇచ్చి అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని కోరారు. అలా చేయకపోతే టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అంటూ ఫైర్ అయ్యారు.

నాలుగు మ్యాచ్ ల‌లో అభిషేక్ శర్మ విఫలం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఇప్పటి వరకు అభిషేక్ శర్మ నాలుగు మ్యాచ్లలో ఆడాడు. ఇందులో మూడు మ్యాచ్లో డక్ అవుట్ కాగా.. సూపర్ 8 లో భాగంగా దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ ల‌లో 15 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. అంతే తప్ప అభిషేక్ శర్మ సాధించింది ఏమీ లేదు.

Also Read: Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

Advertisement

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×