Sonu Sood: సోనూసూద్ ఈ మధ్య కాలంలో చేస్తున్న పోస్ట్‌లు బాగా వైరల్ అవడమే కాకుండా, అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. రీసెంట్‌గా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)ని ఉద్దేశిస్తూ సోనూసూద్ (Sonu Sood) చేసిన ట్వీట్ ఎలా సంచలనంగా మారిందో తెలియంది కాదు. రాబోయే తరాన్ని మేల్కొలిపేలా ఆయన సోషల్ మీడియాపై యుద్ధం ప్రకటించమని కోరారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని కోరారు. చిన్నపిల్లల విషయంలో సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతుందని, తల్లిదండ్రులు ఇది గమనించడం లేదని చెబుతూ, ఇది ఇలాగే కొనసాగితే పిల్లల్లో ఏకాగ్రత లోపించి, సామాజిక సంబంధాలు దెబ్బతింటాయని సోనూసూద్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఉండే కంటెంట్ పిల్లలకు ఏమంత సురక్షితం కాదని, 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించడం నీడ్ ఆఫ్ ది అవర్ అని స్పష్టం చేశారు. దీనిపై ఓ చట్టం తీసుకురావాలని మోదీని సోనూసూద్ కోరారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీనిపై అడుగులు వేస్తున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
సోనూసూద్ చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశం మారి, చాలా వరకు రీచ్ అయ్యింది. తాజాగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన పిల్లల విషయంలో పేరేంట్స్‌కి తగిన సూచనలు చేశారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా ముగ్గురు సిస్టర్స్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై నటుడు సోనూసూద్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. మరోసారి 16 ఏళ్లలోపు పిల్లలకు ఆన్‌లైన్ గేమింగ్‌పై ఆంక్షలు విధించాలని ఈసారి తల్లిదండ్రులకు సోనూసూద్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ..
Also Read- Tollywood : వామ్మో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్ ఫోటో వైరల్!
‘‘ఈరోజు ఘాజియాబాద్‌లో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారు చనిపోయింది హింస వల్ల కాదు.. పేదరికం వల్ల అసలే కాదు. కంటికి కనిపించని ఆన్‌లైన్ గేమింగ్ ఒత్తిడి, డిజిటల్ వ్యసనం కారణంగానే చనిపోయారు. నేను గతంలోనూ దీనిపై నా గళాన్ని వినిపించాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. చదువుకు సంబంధించిన విషయాల్లో తప్ప, మిగతా దేనికీ 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌ను అనుమతించకూడదు, వాటిపై కఠినమైన ఆంక్షలు విధించాలి. చిన్న పిల్లలకు కావాల్సింది అలగారిథమ్స్ కాదు.. సరైన మార్గదర్శకత్వం. పిల్లలకు కావాల్సింది నిరంతరం వెలిగే స్క్రీన్‌లు కాదు.. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు. ఇది ఎవరినో నిందించడానికి చెప్పడం లేదు.. సమయం మించిపోకముందే మన పిల్లలను రక్షించుకోవడం కోసం చెబుతున్నాను. మనం మరిచిపోయే మరో ‘హెడ్‌లైన్’ వార్తగా ఇది మిగిలిపోకూడదు. తల్లిదండ్రులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని సోనూసూద్ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.
Social media can wait. Childhood can’t. 🙏 pic.twitter.com/KByJ38D1oS
— sonu sood (@SonuSood) February 4, 2026
Also Read- MSG Movie: 25 రోజులు.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రఫ్ఫాడించేశారుగా!