Roja Selvamani : ఒకప్పుడు హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన వారిలో రోజా ఒకరు. అప్పట్లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్న రోజా ఈమధ్య కీలక పాత్రల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ షోలలో సందడి చేస్తూ వస్తుంది. గతంలో ఈమె జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షో ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 8 లో జడ్జిగా చేస్తుంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి జడ్డీగా ఉన్నారు రోజా. ఈ షో ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పిల్లలు అయితే తమ స్కిట్లతో తెగ నవ్విస్తున్నారు.. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ని రిలీజ్ చేశారు. ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
డ్రామా జూనియర్స్ 8 లేటెస్ట్ ప్రోమో..
గతంలో రోజా మంత్రిగా భాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల్లో ఆమెకు బాధ్యతలు పెరగడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. రీసెంట్ గా జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ 8 సీజన్లో జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది. రోజా వచ్చిన తర్వాత ఈ షో కి కొత్త కల వచ్చిందని చెప్పాలి.. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ ప్రోమో లో ఐరా టీచరుగా కనిపించింది. సుధీర్‌ని అయితే వాయించి పారేసింది. సుధీర్ ABCD లు ఎన్ని అని ఐరా అడిగితే 26 అండి అంటూ చెప్పాడు. దీనికి ABCDలు నాలుగేరా అంటూ బెత్తంతో నాలుగు దెబ్బలేసింది ఐరా.. సుధీర్ నైతే ఒక ఆట ఆడుకుందని ప్రోమో ను చూస్తే తెలుస్తుంది..
Also Read:కూలీ తెలుగు రైట్స్ తీసుకుంది నాగార్జునే.. కానీ వాళ్ళకి అమ్మేశాడు ?
ఆ తర్వాత అనిల్ రావిపూడి, రోజా స్టేజ్ మీదకి వచ్చారు. ఇప్పటి నుంచి ఒక్క ముక్క కూడా ఆంగ్లంలో మాట్లాడను అని చెప్పిన అనిల్ రావిపూడి ఓకేనా అంటూ చివరిలో అన్నారు. మొత్తానికి ఎటు చూసినా సుధీర్ కి బెత్తం దెబ్బలు తప్పలేదు. చివరగా రోజా దగ్గరికి ఐరా వెళ్ళింది. తెలుగులో మాట్లాడతా అని చెప్పి డ్రామా జూనియర్స్‌లో అంటూ రోజా మొదలుపెట్టారు. ఈ మాట వినగానే అదే బెత్తం తో రోజాని కూడా బుడ్డది బాదేసింది. ఇదేంటి ఇలా చావబాదుతుందని రోజా షాక్ అవుతుంది. రోజాని కొట్టడం చూసి అనిల్ రావిపూడి కూడా ఏంటి ఆవిడని కూడా కొట్టేస్తుందంటూ షాక్ అయ్యారు.. ఇదంతా చూస్తుంటే ప్రోమోకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఎపిసోడ్లో ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.. ఈ ఎపిసోడ్ శనివారం 8.45 నిమిషాలకి జీ తెలుగులో ప్రసారం కాబోతుంది.. ఇక రోజా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుందని ఇండస్ట్రీలో టాక్..