Divvala Duvvada viral video: ఛీ.. ఛీ.. మాకు ఆ పేరు పెట్టే ఉద్దేశమే లేదు.. మేము అంత నీచపు ఆలోచన కలిగి ఉన్నవారము కానే కాదు. అలాంటి పని చేసే ఉద్దేశమే లేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి. అయితే ఈ మాటలకు మాజీ సీఎం జగన్ కు సంబంధం ఉండడంతో ఇప్పుడు నెట్టింట ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అలా ఇలా వైరల్ కాదు.. కొందరు మాత్రం ఈ కామెంట్స్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుండగా, మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు అసలు విషయం మీరు కూడా తప్పక తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఒక అభిప్రాయానికి రండి.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిరంతరం వార్తల్లో ఉండాల్సిందే. ఈయనకు జత కలిసిన దివ్వెల మాధురితో కలిసి వీరు వార్తల్లో నిలుస్తూ.. ఏదోక కామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. దువ్వాడ కుటుంబ వివాదం సమయంలో తెరపైకి వచ్చిన మాధురిని వివాహం చేసుకోవడం గ్యారంటీ అంటూ పలుమార్లు దువ్వాడ చెప్పకనే చెప్పారు.
అలాగే మాధురి కూడా ఇదే మాట పలుమార్లు వినిపించారు. ఆ తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియా కపుల్ గా రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరి వీరిద్దరి వ్యవహారమో ఏమో కానీ, ఇటీవల వైసీపీ నుండి దువ్వాడ ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇక అప్పటి నుండి దువ్వాడ నోట వైసీపీ వ్యతిరేక మాటలు వినిపిస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి.
ఒక్కసారి గతంలోకి వెళితే..
ఏపీలో ఎన్నికల సమయంలో దువ్వాడ గెలుపుకే కాదు, వైసీపీ బలోపేతానికి దివ్వెల మాధురి ప్రత్యేక కార్యాలయం నడిపారు. సోషల్ మీడియా టీమ్ ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్ర కృషి చేసినట్లు ఎన్నో సార్లు దివ్వెల మాధురి చెప్పుకొచ్చారు. అంతేకాదు దువ్వాడ తో పాటు దివ్వెల కూడా పార్టీకి విధేయులుగా కొనసాగుతూ వచ్చారు. ఆ సమయంలో వైఎస్ జగన్ ను ఎవరు విమర్శించినా వీరు విమర్శలకు పదును పెట్టేవారు.
Also Read: AP govt housing rules: మీ చేతిలో రూపాయి ఉందా? అయితే ఇల్లు నిర్మించండి.. ఎలాగంటే?
అబ్బాయి పుడితే జగన్ పేరు?
దువ్వాడ, దివ్వెల ఇద్దరూ ఇంటర్వ్యూలు ఇస్తూ నిరంతరం సోషల్ మీడియా కపుల్స్ గా పేరుగాంచారు. ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత పిల్లలను కలిగే ఛాన్స్ ఉందా అంటూ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. తమకు పుట్టిన బిడ్డకు జగన్ పేరు పెడతామని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. వివాహం అనంతరం వారసుడు గ్యారంటీ అంటూ ఈ జంట చెప్పకనే చెప్పారు.
ఇప్పుడేమంటున్నారంటే?
ఇటీవల వైసీపీ నుండి దువ్వాడ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్.. మీ బిడ్డకు ఇప్పుడు కూడా జగన్ పేరు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లు కుండబద్దలు కొట్టినట్లు నో అని చెప్పడం విశేషం. ఛీ.. ఛీ తమకు అలాంటి ఆలోచన లేదని, తమకు అలాంటి ఉద్దేశమే లేదని, అలాంటి కామెడీ మాటలు తమకు వద్దని దువ్వాడ చెప్పుకొచ్చారు.
తాను చదువుకున్న వ్యక్తినని అలా పేర్లు పెడతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇంతవరకు ఓకే కానీ, కామెడీ మాటలు అంటూ జగన్ ను పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని కొందరు సోషల్ మీడియాలో ఈ వీడియోకు స్పందిస్తుండగా, వారి బాబు వారి ఇష్టం మధ్యలో మీ గోల ఏంటి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తం మీద జగన్ ను ఉద్దేశించి దువ్వాడ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారాయి.
Anchor:- మీకు పుట్టబోయే బిడ్డకు జగన్ పేరు పెట్టాలి అనుకుంటున్నారు అంట కదా ???
దువ్వాడ:- ఛీ ఛీ… నేను చదువుకున్న వ్యక్తిని, వైసీపీ వాళ్ళలాగా నిషాని వెదవని కాదు… అలాంటి నీచపు తప్పుడు వ్యక్తి పేరు నేను ఎందుకు పెడుతాను… pic.twitter.com/AFbdS61i4R
— thaNOs™ 🐺🇮🇳🦅 (@Thanos_Tweetss) June 24, 2025