E-Paper
Advertisement

Sreeleela: శ్రీలీల వింత ప్రశ్న.. నవ్వు ఆపుకోలేకపోయిన హీరో

Sreeleela: శ్రీలీల వింత ప్రశ్న.. నవ్వు ఆపుకోలేకపోయిన హీరో
Advertisement

Sreeleela Parasakthi Promotions: శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్న హీరోయిన్. వరుస సినిమాలు, పెద్ద హీరోలతో అవకాశాలు, నేషనల్ లెవెల్ క్రేజ్ అన్నీ ఉన్నా కూడా ఆమె కెరీర్ లో మాత్రం బ్లాక్ బస్టర్ సినిమాలు తక్కువ. తాజాగా ఆమె నటించిన ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఒక చిన్న వైరల్ సంఘటన చోటుచేసుకుంది. పరాశక్తి సినిమాను సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

ఆర్ట్స్ కాలేజ్ లో కాబోయే డాక్టర్లు ఉంటారా..

ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా టీమ్ ఒక కాలేజ్‌కి వెళ్లింది. స్టూడెంట్స్‌తో సరదాగా మాట్లాడుతూ ఆసక్తిగా ఈవెంట్ సాగుతోంది. ఆ సమయంలో శ్రీలీల స్టూడెంట్స్‌ని చూసి సరదాగా ఒక ప్రశ్న వేసింది. “ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలని అనుకుంటున్నారు?” అని అడిగింది. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు చేతులు లేవడం, చిన్న చప్పట్లు రావడం జరుగుతుంది. కానీ అక్కడ స్టూడెంట్స్ అంతా గట్టిగా కేకలు వేసి నవ్వారు. దానికి కారణం అది ఒక ఆర్ట్స్ కాలేజ్ కావడం. ఒక్కసారిగా విషయం అర్థమైన శ్రీలీల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. వెంటనే నవ్వుతూ, తన తప్పును అంగీకరిస్తూ ఆ క్షణాన్ని లైట్‌గా తీసుకుంది.

శ్రీలీల కాలేజ్ వైరల్ వీడియో..

Advertisement

ఇది అక్కడితో ఆగలేదు. ఎవరో తీసిన వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో..అది కాస్తా వైరల్ అయింది. కొంతమంది ఫన్నీగా తీసుకోగా..మరికొందరు ట్రోల్స్ కూడా చేశారు. అంతేకాకుండా శ్రీలీల ఈ మాటలు అన్నప్పుడు అక్కడ ఉన్న హీరో శివ కార్తికేయన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. మొత్తం పైన శ్రీలీలకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

శ్రీలీల చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై, 2019లో ‘కిస్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పెళ్లి సందD, ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, మాస్ జాతర లాంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ స్టార్ హీరోలతో చేసినవే. కానీ ఆశించిన స్థాయిలో అన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కాలేదు.

Advertisement

భగవంత్ కేసరి మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. బాలకృష్ణతో ఆమె చేసిన పాత్రకి మంచి పేరు వచ్చింది.
గుంటూరు కారం పర్వాలేదు అనిపించింది కానీ, ఇండస్ట్రీ షేక్ చేసే స్థాయి హిట్ కాదు. అయితే శ్రీలీలకు అసలైన క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం పుష్ప 2 సినిమాలోని స్పెషల్ సాంగ్. కిస్సిక్ పాటతో ఆమెకు పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు వచ్చింది. 2025లో వచ్చిన రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు.

ఇప్పుడు ఆమె ఆశలన్నీ పరాశక్తి మీదే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే, శ్రీలీల కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంతేకాదు, తెలుగులో పవన్ కళ్యాణ్తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ మీద కూడా భారీ అంచనాలున్నాయి.

ALSO READ: Rahul Sipligunj Cult Webseries : రాహుల్ సిప్లిగంజ్‌కు హైకోర్టు షాక్..కల్ట్ వెబ్ సిరీస్ విడుదలకు అడ్డంకి..!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×