E-Paper
Advertisement

Cheekatilo OTT : శోభిత ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Cheekatilo OTT : శోభిత ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Advertisement

Cheekatilo OTT : టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ పెళ్ళయిన తరువాత ఫస్ట్ టైమ్ ఓ కొత్త మూవీతో ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ తో శోభిత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. కాకపోతే ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు విడుదల కాబోతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘చీకటిలో’ (Cheekatilo) అనే కొత్త ప్రాజెక్ట్ తో శోభిత తిరిగి తెరపై మెరవబోతున్నారు. ఈ సినిమాను చాలారోజుల క్రితమే ప్రకటించారు. 2026 జనవరి 23న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ క్రైమ్ సస్పెన్స్ డ్రామా ప్రత్యేకంగా తెలుగు, హిందీ, తమిళ భాషలలో ప్రీమియర్ కానుంది. అంతేకాదు ఈ చిత్రం భారతదేశంతో సహ 240 కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రైమ్ వీడియోలో ఏకకాలంలో ప్రసారం కానుంది. మూవీ రిలీజ్ డేట్ తో పాటు మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. విశ్వదేవ్ రాచకొండ ఇందులో కథానాయకుడిగా నటిస్తుండగా… చైతన్య విశాలాక్షి, ఇషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ‌పై ప్రముఖ చిత్రనిర్మాత సురేష్ బాబు ఈ మూవీని నిర్మించారు. శరణ్ కోపిశెట్టి దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. శోభిత చివరి సారిగా ‘లవ్ సితార’లో కన్పించింది. ఇప్పుడు ఆమె నెక్స్ట్ మూవీ ‘చీకటిలో’ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ కానుంది.

Advertisement

Read Also : యుద్ధం నుంచి బయటపడి దెయ్యం చేతిలో బుక్కయ్యే అమాయకుడు… భయపెడుతూనే నవ్వించే హర్రర్ మూవీ

స్టోరీ ఏంటంటే ?

హైదరాబాద్‌ లోని చీకటి వీధుల్లో జరిగే స్టోరీ ఇది. సంధ్య అనే నిజమైన క్రైమ్ పాడ్‌కాస్టర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. నిజమైన సంఘటనల ఆధారంగా క్రైమ్ కథలను ప్రజలకు అందించడమే సంధ్య పని. ఈ నేపథ్యంలోనే ఆమె దగ్గర పని చేసే ఇంటర్న్ అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. మొదట్లో విషాదకరమైన సంఘటనతో సంధ్య బాధ పడుతుంది. కానీ నెమ్మదిగా దాని నుంచి బయట పడి, నిజం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇంటర్న్ మరణం గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక… అది ప్రమాదం కాదని, క్రైమ్ చైన్ అని తెలుసుకుంటుంది. ఆమె బయట పెట్టాలకునుకునే ఈ క్రైమ్ నెట్ వర్క్ వల్లే సంధ్య డేంజర్ లో పడుతుంది. ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుంది ? అసలు ఆ ఇంటర్న్ ఎలా చనిపోయింది ? అన్నది కథ. ఈ చిత్రంలో పాడ్‌కాస్ట్‌ల వంటి ఆధునిక అంశాలు ఉండడంతో మూవీ యూత్ ను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. మరి ఓటీటీలోకి వచ్చాక దీనికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×