E-Paper
Advertisement

డిజాస్టర్ హీరోయిన్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ… సాహసం చేస్తున్న నందమూరి హీరో?

డిజాస్టర్ హీరోయిన్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ… సాహసం చేస్తున్న నందమూరి హీరో?
Advertisement

Mokshagna Debut Film: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబం నుంచి నాలుగు తరాలు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి అభిమానులు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూనే కాలయాపనం చేస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఈయన సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

మోక్షజ్ఞ సినిమాకు మోక్షం వచ్చేనా..

ఇకపోతే నేడు నందమూరి వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో ఈయన మొదటి సినిమాకు సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఈయన పుట్టినరోజు సందర్భంగా తన మొదటి సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన విలువడే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక టాలీవుడ్ సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని గతంలో చెప్పినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.

మోక్షజ్ఞ కోసం రంగంలోకి వశిష్ట..

Advertisement

ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ కోసం మరొక డైరెక్టర్ రంగంలోకి దిగారు. నందమూరి కళ్యాణ్ రామ్ బింబి సారా సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన వశిష్ట ఇప్పుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతలను తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే వశిష్ట ఒక అద్భుతమైన కథను బాలయ్యకు వినిపించడంతో బాలయ్య కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. వశిష్టత డైరెక్షన్లో ఎస్విసి బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడిగా హీరోయిన్ ఎంపిక కూడా పూర్తి అయింది అని తెలుస్తుంది.

మోక్షజ్ఞకు జోడిగా శ్రీ లీల…

ఈ సినిమాలో మోక్షజ్ఞ జోడిగా నటి శ్రీ లీల హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ప్రస్తుతం శ్రీ లీల డిజాస్టర్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్నారు. ఇలా డిజాస్టర్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో భాగం కావడం ఏంటి? ఈమెను హీరోయిన్గా తీసుకుంటే సాహసం చేసినట్లే అంటూ ఈ వార్తలపై నందమూరి అభిమానులు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే అధికారక ప్రక్కన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ కూడా సుమారు 15 నిమిషాల పాటు క్యామియో పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి తరచు ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేస్తున్న ఇప్పటివరకు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోవడం గమనార్హం.

Advertisement

Also Read: విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Related News

హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!

ఎన్టీఆర్–నీల్ మూవీ.. హైప్ ఎక్కువైపోతుందా?

సంగీత్ శోభన్ ‘అంతా రాములోరు చూస్కుంటారు’ గ్లింప్స్ రిలీజ్!

‘రాకా’లో పృథ్వీరాజ్.. ఏమన్నారంటే?

విడుదలకు ముందే జైలర్ 2 సరికొత్త రికార్డ్.. భారీ ధరకు నాన్ థియేట్రికల్ హక్కులు!

చిరు డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా..!

Big Stories

Advertisement
×