BoAt Wave Fury smartwatch: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు కేవలం టైం చూసే గాడ్జెట్‌గా మాత్రమే కాకుండా, హెల్త్ ట్రాకర్స్‌గా, ఫ్యాషన్ యాక్సెసరీస్‌గా మారిపోయాయి. ముఖ్యంగా యూత్ చేతిలో ఒక స్టైలిష్ స్మార్ట్‌వాచ్ ఉండటం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. అయితే ఎక్కువ ధర పెట్టి కొనలేము అనుకునే.. వారి కోసం ప్రముఖ ఆడియో, వేరబుల్స్ బ్రాండ్ ‘బోట్’ అద్భుతమైన ఫీచర్లతో.. అతి తక్కువ ధరకే స్మార్ట్‌వాచ్‌లను అందిస్తోంది. అందులో మార్కెట్లో.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మోడల్ ‘boAt Wave Fury’. కేవలం రూ. 1,199 ధరతో లభిస్తున్న ఈ వాచ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ బడ్జెట్‌లో లభించే వాచ్ అయినప్పటికీ.. బోట్ దీని డిజైన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. యాక్టివ్ బ్లాక్ కలర్ స్ట్రాప్, మెటాలిక్ ఫినిషింగ్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఇది రోజంతా.. చేతికి పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా తేలికగా ఉంటుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇందులో స్పష్టమైన విజువల్స్ అందించే.. పెద్ద స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఎండలో కూడా ఇది స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే వివిధ రకాల క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేసెస్ సహాయంతో మీ మూడ్‌కు తగినట్లుగా వాచ్ లుక్‌ను మార్చుకోవచ్చు.
ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకునే.. వారికి ఈ స్మార్ట్ వాచ్ ఒక మంచి పర్సనల్ కోచ్‌లా పని చేస్తుంది. ఇందులో.. ఉండే లేటెస్ట్ సెన్సార్లు మీ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, నిద్ర తీరును నిరంతరం పర్యవేక్షిస్తాయి. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి పలు రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. మీరు రోజూ చేసే వ్యాయామం, నడిచిన అడుగులు, కాలరీల కౌంట్ వంటి వివరాలను ఇది కచ్చితంగా ట్రాక్ చేస్తుంది.
Also Read: డస్ట్ మాయం, ఇల్లు క్లీన్.. సోఫాలు, కార్నర్స్ కోసం అదిరిపోయే వ్యాక్యూమ్ క్లీనర్స్!
స్మార్ట్ వాచ్‌లలో బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఈ స్మార్ట్ వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంలో రోజాల తర బడి పని చేస్తుంది. దీని వల్ల పదే పదే ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ ఉండదు. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్.. లేకపోయినా, స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు, కాల్ అలర్ట్స్, సోషల్ మీడియా మెసేజ్ అప్‌డేట్స్ అన్నీ నేరుగా మీ చేతికి అందుతాయి. అంతేకాకుండా.. ఇది వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉండటం వల్ల వర్షంలో తడిచినా లేదా వర్కౌట్ చేసేటప్పుడు చెమట పట్టినా ఎలాంటి సమస్య ఉండదు.
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, హెల్త్ ట్రాకింగ్ , అద్భుతమైన ఫీచర్లు కోరుకునే వారికి బోట్ స్మార్ట్‌వాచ్ బెస్ట్ అని చెప్పొచ్చు. కేవలం రూ. 1,199 ధరలో లభించడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. మీరు కూడా బడ్జెట్‌లో మంచి స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటే దీనిని ధైర్యంగా ఆర్డర్ చేయొచ్చు.