E-Paper
Advertisement

డీజీపీపై శివాలెత్తిన టీఆర్ఎస్ చీఫ్ కవిత.. చట్టాలు ఉండి ఏం లాభం?

డీజీపీపై శివాలెత్తిన టీఆర్ఎస్ చీఫ్ కవిత.. చట్టాలు ఉండి ఏం లాభం?
Advertisement

Hyderabad: టీఆర్ఎస్ చీఫ్ కవిత నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఏదో ఒక విధంగా ప్రజల ముందుకు వస్తున్నారు. తాజాగా డీజీపీ సీవీ ఆనంద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కానిస్టేబుల్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తే కేవలం సస్పెన్షన్‌తో సరిపెడతారా అంటూ రుసరుసలాడారు. ఆయన డీజీపీ అయిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగిందని ఆరోపించారు.

డీజీపీపై శివాలెత్తిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం మీడియా ముందుకొచ్చిన టీఆర్ఎస్ చీఫ్ కవిత, కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‍పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తినని ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ, ఉన్నారని గుర్తు చేశారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్న తనను ఇంత నీచంగా కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకొవడం ఏంటని ఫైర్ అయ్యారు. కేవలం కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు. మహిళలను దూషిస్తే మూడేళ్ల వరకు శిక్ష పడుతుందని, కానీ కానిస్టేబుల్ ను సస్పెండ్‌తో సరిపెట్టారని మండిపడ్డారు. సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోకుంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం పరువు తీస్తానని హెచ్చరించారు.

కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోకుంటే.. చట్టాలు ఉండి ఏం లాభం?

Advertisement

డీజీపీకి ఇద్దరు కోడళ్లు ఉన్నారని, వాళ్లపై ఈ విధంగా చేస్తే ఊరుకుంటారా? అంటూ డీజీపీని ప్రశ్నించారు. తనలాంటి మహిళకు రక్షణ ఇవ్వలేని మీరు, సాధారణ మహిళలకు ఎలా ఇస్తారు? ఇటీవల కాలంలో మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా ట్రోలింగ్స్ దారుణంగా జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోకుండా సైలెంట్ ఉండటాన్ని తప్పుబట్టారు. ఇలాంటి విషయంలో చర్యలు తీసుకోకుండే చట్టాలు ఉండి ఏం లాభం? డీజీపీ సీవీ ఆనంద్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రైమ్ రేటు పెరిగిందన్నారు. ఆ కానిస్టేబుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు ఎందుకు పెట్టలేదు? మహిళల పట్ల ఒక్క పదం అసభ్యంగా మాట్లాడినా కేసులు నమోదు చేయాలన్న సంగతి డీజీపీకి తెలియదా? తెలియకపోతే చట్టాలను ఒక్కసారి డీజీపీ చదువుకోవాలని కోరారు. మహిళలపై అసభ్యంగా కామెంట్స్ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష విధించాలని ఐటీ చట్టంలో ఉందన్నారు.

ALSO READ: కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ భారీ ధర్నా!

Advertisement

అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. రేవంత్ పక్కన కోదండరాం ఉండటంతో ఉద్యమకారులు నమ్మారని, మూడేళ్లలో వాళ్లకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులపై వేసిన కేకే కమిటీ ఏమైంది? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఉద్యమకారులకు తెలంగాణ జన సమితి నుంచి కోదండరామ్ గుర్తింపు కార్డులు ఇచ్చారని, ప్రభుత్వం తరఫున ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను తొక్కుకుంటూ పోతే ఎలా? రానున్న అసెంబ్లీ సమావేశాల్లోపు ఉద్యమకారులపై సీఎం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ బీసీలపై 100 రోజుల కార్యాచరణ గురించి మాట్లాడితే నవ్వు వస్తుందని, బీసీల కోసం చేయాల్సిన పని కాంగ్రెస్ చేయలేదన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత.

Related News

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ భారీ ధర్నా!

మేడ్చల్‌లో అక్రమ మద్యం మాఫియాకు ఇక చెక్.. కొత్త సీఐగా దీపికా భాధ్యతలు!

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు జోరు.. లక్ష్యాన్ని మించిన దరఖాస్తులు.. ఎన్నో తెలుసా..!

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

Big Stories

Advertisement
×