Vishwanath And Sons OTT: వర్సటైల్ యాక్టర్ సూర్య ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం “విశ్వనాథ్ అండ్ సన్స్”(Vishwanath And Sons). ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరో సూర్య (Suriya)మమితా బైజు (Mamitha Baiju)హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాకు రెండు భాషలలో విపరీతమైన క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సూర్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ల రాబట్టిన సినిమాల జాబితాలో విశ్వనాథ్ అండ్ సన్స్ చేరిపోయింది. ఇప్పటికీ కూడా పలుచోట్ల ఈ సినిమా థియేటర్లో విజయవంతంగా ప్రసారమవుతుంది. ఇలా థియేటర్లలో ఒకవైపు రన్ అవుతూనే మరోవైపు డిజిటల్ స్ట్రీమింగ్ కు కూడా సిద్ధమైందని చెప్పాలి. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) కొనుగోలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అప్డేట్ వెల్లడించారు. ఈ సినిమాని వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 11వ తేదీనే డిజిటల్ మీడియాలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు.తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇలా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా నెల రోజులు తిరగకుండానే డిజిటల్ మీడియాలోకి అందుబాటులోకి రాబోతుండటం విశేషం.
సంజయ్ విశ్వనాథ్ (సూర్య)కి పెళ్లి మీద అంతా నమ్మకం ఉండదు. పెళ్లి పట్ల ఆసక్తి లేనటువంటి విశ్వనాథ్ వారసులు కావాలని కోరుకుంటారు ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్ళి సరోగసి ద్వారా ఒక బిడ్డకు తండ్రి అవుతారు అయితే తన బిడ్డతో సంతోషంగా ఉన్న సమయంలో తన కొడుకుకి చిన్న ఆనారోగ్య సమస్య కారణంగా బోన్ మ్యారో మార్చాల్సి ఉంటుంది. ఆ సమయంలో తనకు జన్మనిచ్చిన మ్యాడీనే కొడుకుకు బోన్ మ్యారొ ఇస్తాను అంటుంది. ఈ క్రమంలో మ్యాడీ.. సంజయ్ ని లవ్ చేస్తుంది. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఎక్కువగా ఉండటంవల్ల సంజయ్ మ్యాడీను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు? మరి విశ్వనాధ్ మనసు మారి మ్యాడీను పెళ్లి చేసుకున్నారా? సంజయ్ విశ్వనాథ్ కు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే థియేటర్లలో ఈ సూపర్ హిట్ సినిమాని మిస్ అయినవారు సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఎదురుచూస్తూ అనంతరం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా చూడొచ్చు.
Also Read: బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!