E-Paper
Advertisement

Rashmika: ఏంటీ.. 4వేల కోట్ల రష్మికనే మూవీ నుంచి తప్పించారా.. ఇదెక్కడి దారుణం?

Rashmika: ఏంటీ.. 4వేల కోట్ల రష్మికనే మూవీ నుంచి తప్పించారా.. ఇదెక్కడి దారుణం?

Rashmika:సాధారణంగా ఒక సినిమాలో ఒక హీరోయిన్ మంచి విజయం అందుకుంది అంటే.. ఆమెను తదుపరి చిత్రాలలో కూడా తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అలాంటిది తన చిత్రాలతో ఏకంగా 4 వేల కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించడమే కాకుండా “క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్” గా పేరు సొంతం చేసుకున్న రష్మికను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఏ రేంజ్ లో ఆసక్తి కనబరుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అలాంటి ఈ హీరోయిన్ ని ఒక సినిమా నుండి తప్పించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు చిత్ర బృందం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సక్సెస్ కోసం ఆరాటపడుతున్న శివ కార్తికేయన్..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఇటీవల ‘మదరాసి’ అనే చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఇందులో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటించింది. ఏ.ఆర్.మురగదాస్ (Muragadas) దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం అభిమానులకు మింగుడు పడలేదు.

దీంతో ప్రస్తుతం ఆయన ఎలాగైనా సరే మరో మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకి రావాలని.. ఆఖరికి ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర (Sudha kongara)తో ‘పరాశక్తి’ అనే సినిమాను ఫైనలైజ్ చేశారు. పీరియాడిక్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శివ కార్తికేయన్ సరసన శ్రీ లీల (SreeLeela) హీరోయిన్గా నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం మొదటిసారి జత కట్టిన శివ కార్తికేయన్ , శ్రీ లీల ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమా కూడా చేయనున్నారట. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాలలో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకి వెళ్తే శివ కార్తికేయన్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలలో డాన్ సినిమా కూడా ఒకటి. సీబీ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. పైగా 100 కోట్ల క్లబ్లో చేరి సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ALSO READ:Nagarjuna: నాగార్జున లగ్జరీ హౌస్ చూశారా.. ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనాల్సిందే!

4000 కోట్ల హీరోయిన్ నే తీసేసారా?

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాలోనే శ్రీ లీలా, శివ కార్తికేయన్ నటిస్తున్నట్లు సమాచారం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ముందుగా నేషనల్ క్రష్ రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ అనుకోని కారణాలవల్ల రష్మికను తప్పించి.. ఆమె స్థానంలో శ్రీ లీలను ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

మొత్తానికైతే ఈ సినిమా నుంచీ 4వేల కోట్ల బాక్సాఫీస్ క్వీన్ గా పేరు సొంతం చేసుకున్న రష్మికను తప్పించి సక్సెస్ కోసం ఆరాటపడుతున్న శ్రీ లీలను ఎంపిక చేసుకోవడంపై రష్మిక అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా నుండి రష్మికను తప్పించడం ఇప్పుడు వైరల్ గా మారింది.

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×