Sreeleela: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాల అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి శ్రీలీల(Sreeleela)ఒకరు. ఈమె హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా అగ్ర హీరోల సినిమాలలో అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చెన్నైలో జరిగిన అమృత ఏవియేషన్ కాలేజ్ ప్రెస్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ విద్య సంస్థకు శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక శ్రీలీల ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్ అంటూ కేకలు వేయడం మొదలు పెట్టారు.
ఇక ఈ కార్యక్రమ హోస్టు కూడా శ్రీ లీలను ఉద్దేశించి సౌత్ ఇండియన్ స్టార్, లేడీ సూపర్ స్టార్ అంటూ మాట్లాడారు. ఇదే విషయం పట్ల ఒక రిపోర్టర్ నుంచి ప్రశ్నలు ఎదురు కావడంతో శ్రీలీల సమాధానం చెబుతూ.. తాను లేడీ సూపర్ స్టార్ కాదు. ఆస్థానం ఎప్పటికీ నయనతార(Nayanthara) దేనని తెలియజేశారు. నటన విషయంలో నాకు నయనతార రోల్ మోడల్. నేను ఆమె స్థానానికి చేరుకోవాలి అంటే ఇంకా చాలా టైం పడుతుందని శ్రీలీల ఈ సందర్భంగా తనని లేడీ సూపర్ స్టార్ అని పిలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె చదువుల విషయంలో ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి జయాపజయాల గురించి కూడా విద్యార్థులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. ఇక శ్రీలీల ఇటీవల మెడిసిన్ పూర్తిచేసి పట్టా అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక వైపు నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు తన మెడిసిన్ చదువును పూర్తి చేయడం గురించి కూడా శ్రీలీల తెలియచేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన తల్లి గురించి కూడా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
బై వన్ గెట్ వన్ ఫ్రీ బాండింగ్..
శ్రీలీల సినిమాల పరంగా ఏ కార్యక్రమానికి వెళ్లినా, ఏ సినిమా షూటింగ్ వెళ్ళినా, తనతో పాటు తన తల్లి కచ్చితంగా ఉంటారు. ఈ విషయం గురించి శ్రీలీల మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్లినా మా అమ్మ నాతో పాటే ఉంటుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ అనే విధంగా మా ఇద్దరి బాండింగ్ ఉంటుందని తెలియజేశారు. నేను వేసే ప్రతి అడుగులోనూ తన అమ్మ సపోర్ట్ తనకు ఉంటుందని శ్రీలీల ఈ సందర్భంగా తన తల్లి గురించి మాట్లాడటమే కాకుండా అక్కడున్న మాతృమూర్తులు అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక శ్రీలీల కెరియర్ విషయానికి వస్తే.. ఈమె ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ధనుష్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ సినిమాల షూటింగ్ పనులలో కూడా బిజీగా గడుపుతున్నారు.
Also Read: ప్రభాస్ సినిమా పై నోరు పారేసుకున్న కమెడియన్ సప్తగిరి.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!