E-Paper
Advertisement

Safest Family SUV: డస్టర్ vs సియెర్రా vs సెల్టోస్.. వీటిలో మోస్ట్ సేఫెస్ట్ SUV ఏది?

Safest Family SUV: డస్టర్ vs సియెర్రా vs సెల్టోస్.. వీటిలో మోస్ట్ సేఫెస్ట్ SUV ఏది?
Advertisement

Safest Family SUV in India: దేశంలో మిడ్ సైజ్ SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఫీచర్లు, డిజైన్, పర్ఫార్మెన్స్  మాత్రమే కాకుండా కొనుగోలుదారులు భద్రతకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రెనాల్ట్ డస్టర్, టాటా సియెర్రా, కియా సెల్టోస్ భద్రత పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ మూడు SUVలు కూడా భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. అయినప్పటికీ, వీటిలో సేఫెస్ట్ కారు ఏదనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పెద్దల సేఫ్టీలో ఏ కారు ముందుంది?

పెద్దల సేఫ్టీ విషయంలో కియా సెల్టోస్ కొంచెం ముందంజలో ఉంది. ఫ్రంటల్ ఆఫ్‌ సెట్ క్రాష్ టెస్ట్‌ లో సెల్టోస్ మంచి స్కోర్లు సాధించింది. ముఖ్యంగా డ్రైవర్ ఛాతీ, కాళ్ల రక్షణలో దీనికి మంచి రేటింగ్ వచ్చింది. అదే ప్రాంతాల్లో రెనాల్ట్ డస్టర్‌ కు కాస్త తక్కువ రేటింగ్ లభించింది. మొత్తం స్కోరులో సెల్టోస్ కాస్త ఎక్కువ పాయింట్స్ సాధించింది. భారత్ NCAPలో పరీక్షించిన పెట్రోల్, డీజిల్ SUVల్లో సెల్టోస్ అత్యుత్తమ ఫ్రంటల్ క్రాష్ స్కోర్లలో ఒకటి నమోదు చేసింది.

Advertisement

ఇక టాటా సియెర్రా కూడా భద్రతా పరంగా బలమైన పనితీరు చూపించింది. దాదాపు పూర్తి స్కోర్‌ కు దగ్గరగా నిలిచింది. తల, మెడ, తొడల లాంటి కీలక భాగాలకు మంచి ప్రొటెక్షన్ అందించింది.కొన్ని సందర్భాల్లో ఛాతీ, టిబియా ప్రాంతాల్లో రేటింగ్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల సెల్టోస్ కంటే కాస్త వెనుకబడింది. అయినప్పటికీ సియెర్రా చాలా సురక్షితమైన SUVగా గుర్తింపు పొందింది.

రెనాల్ట్ డస్టర్ కూడా మంచి భద్రతా ప్రమాణాలు కలిగిన SUVగా గుర్తింపు తెచ్చుకుంది. చాలా ముఖ్యమైన ప్రాంతాల్లో మంచి రక్షణ అందించినప్పటికీ, కొన్ని క్రాష్ పరీక్షల్లో ఛాతీ, కాళ్ల భాగాల రక్షణలో ఇతర రెండు SUVలతో పోలిస్తే కొద్దిగా తక్కువ స్కోర్లు వచ్చాయి. అందువల్ల ఈ పోలికలో మూడో స్థానంలో నిలిచింది.

సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ లో మూడూ బెస్ట్!

Advertisement

సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ లో మూడు SUVలు కూడా అద్భుతమైన రేటింగ్ సాధించాయి. సైడ్ మూవబుల్ బారియర్ టెస్ట్‌ లో ఫుల్ మార్కులు సాధించాయి.  సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌ లో కూడా మంచి రేటింగ్‌  పొందాయి. అంటే పక్కదెబ్బల సమయంలో ప్రయాణికులకు మంచి భద్రత లభించే అవకాశం ఉంది.

పిల్లల భద్రత గురించి..

పిల్లల భద్రత విషయంలో కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్ సమాన స్థాయిలో నిలిచాయి. ఈ రెండు SUVలు 49లో 45 పాయింట్లు సాధించాయి. పిల్లల కోసం ఉపయోగించే చైల్డ్ సీట్ ఫిట్మెంట్, డమ్మీ టెస్టులు, క్రాష్ సమయంలో మంచి సేఫ్టీ అందించింది. టాటా సియెర్రా కూడా పిల్లల భద్రతలో చాలా దగ్గర స్కోరు సాధించింది. ముఖ్యంగా చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్‌లో పర్ఫెక్ట్ స్కోరు సాధించింది.

మూడింటిలో ఏది బెస్ట్ అంటే?

ఫీచర్ల పరంగా చూస్తే, మూడు SUVల్లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, ISOFIX మౌంట్స్ లాంటి భద్రతా సదుపాయాలు స్టాండర్డ్‌ గా ఉన్నాయి. అయితే కియా సెల్టోస్‌లో అదనంగా రియర్ ఆక్యుపెంట్ అలర్ట్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా సియెర్రాలో ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్  లాంటి ఆధునిక టెక్నాలజీ కలిగి ఉంది. యాక్టివ్ సేఫ్టీ విషయంలో సియెర్రా కొంత ఆధిక్యం చూపుతోంది. మొత్తంగా చూస్తే, పూర్తి క్రాష్ సేఫ్టీలో  కియా సెల్టోస్ ముందు ఉండగా, ఆధునిక భద్రతా టెక్నాలజీలో టాటా సియెర్రా బలంగా ఉంది. రెనాల్ట్ డస్టర్ కూడా సేఫ్ SUVగా కొనసాగుతోంది.

Read Also: టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.45 లక్షల తగ్గింపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×