BigTV English

Hero Sriram Drugs Case: డ్రగ్స్ గుట్టు బయటపెట్టిన హీరో శ్రీరామ్!

Hero Sriram Drugs Case: డ్రగ్స్ గుట్టు బయటపెట్టిన హీరో శ్రీరామ్!

Hero Sriram Drugs Case: ‘ఒకరికి ఒకరు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన హీరో శ్రీరామ్ (Sriram)అలియాస్ శ్రీకాంత్ రెండు రోజుల క్రితం చెన్నైలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. అంతే కాదు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా ఏకంగా 42 సార్లు ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. జ్యూడిషియల్ కస్టడీ విధించింది కోర్ట్. అయితే తాజాగా కోర్టు ముందు తన వాదనలను హీరో శ్రీరామ్ వినిపించినట్లు సమాచారం.


ఆ నాయకుడి వల్లే డ్రగ్స్ అలవాటు – హీరో శ్రీరామ్

హీరో శ్రీరామ్ తనకు డ్రగ్స్ అలవాటు అవడం వెనుక అసలు విషయాన్ని బయటపెట్టారు. తాజాగా ఆయన కోర్టులో మాట్లాడుతూ..” నాకు AIADMK మాజీ నేత ప్రసాద్ రూ.10లక్షలు ఇవ్వాలి. ఆ డబ్బు అడిగిన ప్రతిసారి కొకైన్ ఇచ్చేవాడు. ఆ తర్వాత డబ్బులు విషయం మర్చిపోయి.. నేనే అతడిని డ్రగ్స్ అడుక్కునే దుస్థితికి వచ్చాను. డ్రగ్స్ వినియోగించి, పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నా కొడుకును నేను చూసుకోవాలి. దయచేసి నాకు బెయిల్ మంజూరు చేయండి” అంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


2 గంటల పాటు విచారణ..

ఇకపోతే డ్రగ్స్ కేసులో పోలీసులు రెండు రోజుల క్రితం శ్రీ రామ్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక మూడు సెక్షన్ల కింద శ్రీరామ్ పై కేసు కూడా నమోదు చేశారు. అనంతరం సుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో రెండు గంటల పాటు విచారించి, అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండుసార్లు ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరు పరచగా.. కోర్టు దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

పోలీస్ విచారణలో విస్తుపోయే నిజాలు..

పోలీసులు రెండు గంటల పాటు శ్రీరామ్ ను విచారించగా అందులో ఆయన మాట్లాడుతూ.. “ప్రసాద్ నిర్మాణంలో తీంగిరై అనే సినిమా నేను చేశాను. అందుకు సంబంధించి నాకు ఆయన ఇంకా 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు అడిగితే కొకైన్ ఇచ్చి నన్ను బానిసను చేశారు..” అంటూ తెలిపారు.

కేసులో కీలక పరిణామాలు..

రెండు రోజుల క్రితం చెన్నైలోనే ఒక బార్ లో ప్రసాద్ తాగి గొడవకు దిగగా.. పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతడిని విచారిస్తే ప్రదీప్ అనే వ్యక్తి ద్వారా హీరో శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేశారని చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. ప్రదీప్.. ప్రసాద్ నుంచి 40 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా హీరో శ్రీరామ్ కి తానే డ్రగ్స్ సరఫరా చేస్తానని ఒప్పుకున్నారు. మొత్తానికి ఈ కేసులో చోటు చేసుకున్న కీలక పరిణామాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ALSO READ:Manchu Vishnu: నటుడిగా ఇండస్ట్రీకి గుడ్ బై.. ఏకంగా బిగ్ బీకి ఎసరు పెట్టిన విష్ణు.. ఏంటయ్యా నీ ప్లాన్!

Related News

Shruthi Hassan: పుట్టకముందే అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్!

Film industry: విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన జంట!

Anupama Parameswaran: ఆ ఒక్క రూమర్.. నా కెరియర్ ను నాశనం చేసింది.. అనుపమ ఎమోషనల్!

Anupama Parameswaran: హీరోయిన్  కాకపోతే అనుపమ ఆ పని చేసి ఉండేదా?

Film industry: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Raghava lawrance : మానవత్వాన్ని చాటుకున్న హీరో.. కన్నీళ్లు తెప్పిస్తున్న పోస్ట్..

Big Stories

×