Kannappa Movie : దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ సాగిన కన్నప్ప మూవీ ఫైనల్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ నెల 27న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా థియేటర్స్‌లోకి రాబోతుంది. ఒక మంచు ఫ్యామిలీ మాత్రమే ఈ సినిమాలో నటిస్తే ఇంత హైప్, బజ్ ఉండకపోయేది. కానీ, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్ కూడా ఉండటంతో ఈ సినిమాపై అందరి కన్ను పడింది.
పైగా ఈ సినిమాను మంచు ఫ్యామిలీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అసలేం ఉందని ఇన్ని కోట్లు పెట్టి నిర్మించారు అనే ఎగ్జైట్మెంట్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో ఉంది. అయితే మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ కన్నప్ప సినిమా ముందు ఉన్న సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం…
ప్రభాస్ చేయాల్సిన సినిమా
కన్నప్ప మూవీని ప్రభాస్ కోసం రిజర్వ్ చేసి పెట్టాడు కృష్ణం రాజు. చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా.. ప్రభాస్ తన భక్త కన్నప్ప మూవీ రీమేక్ చేస్తే చూడాలని. కానీ, ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశాడు. ఆ తర్వాత ఈ కన్నప్ప ప్రాజెక్ట్ మంచు వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే, కృష్ణం రాజు ఉన్న టైంలోనే ఆయన పర్మిషన్ తీసుకున్నట్టు మంచు విష్ణు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇప్పుడు ప్రభాస్ కంటే గొప్పగా విష్ణు చేశాడా? కన్నప్ప అంటే కృష్ణం రాజే గుర్తొస్తారు. మరి ఆయనను మరిచిపోయేలా చేస్తాడా ? అనే క్వశ్చన్స్ ఉన్నాయి.
న్యూజిలాండ్‌లో షూటింగ్..
పురాణాల ప్రకారం కన్నప్ప పుట్టి పెరిగింది శ్రీ కాళహస్తి. అక్కడే శివ భక్తుడిగా కూడా మారాడు. కానీ, ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాను శ్రీ కాళహస్తిలో కాకుండా న్యూజిలాండ్‌లో షూట్ చేశాడు.
దీనికి ఆయన సమాధానం అడవి, గ్రీనరీ అని చెప్పాడు. శ్రీ కాళహస్తిలో కూడా అడవి ఉంది. కానీ, గ్రీనరీ ఉండకపోవచ్చు. ఆ గ్రీనరీ వల్ల రియాల్టీకి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే న్యూజిలాండ్ షూటింగ్ కాబట్టి… భారీగా బడ్జెట్ పెరిగిపోయింది. అదేదో శ్రీకాళహస్తిలోనే షూట్ చేసి ఉంటే, రియాలిటీకి దగ్గరగా ఉండేది. బడ్జెట్ కూడా తగ్గేది.
కాస్టూమ్స్ అండ్ ఆయుధాలు
సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ… ఆ పాత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ వచ్చారు. నిజానికి ఇది మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ, ఆ ప్రమోషనల్ స్ట్రాటజీ వల్ల కన్నప్ప మూవీకి ఒరిగిందేం లేదు. ఆ పాత్రల కాస్టూమ్స్. అలాగే ఆ పాత్రల చేతుల్లో ఉండే ఆయుధాల వల్ల విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.
కాస్టూమ్స్, ఆ ఆయుధాల మేకింగ్ విషయంలో చాలా గట్టిగా ఫోకస్ పెట్టాల్సింది. చివరికి పాన్ ఇండియా ప్రభాస్ ఫస్ట్ లుక్, ఆయన చేతిలో ఉన్న కర్రపై కూడా ట్రోల్స్ వచ్చాయంటే అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎలా ఉందో.
మంచు విష్ణు ఇంటర్వ్యూలు
కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా ముగ్గురు జర్నలిస్ట్‌లతో ఒకే సారి ఇంటర్వ్వూ ఇచ్చాడు. ఇది కూడా మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ. కానీ, ఏం చేద్దాం… అది కూడా సినిమాపై హైప్ పెంచడానికి ఎలాంటి సాయం చేయలేవు. పైగా మంచు విష్ణుపై ఎప్పటిలానే ట్రోల్స్ వచ్చాయి.
దీనికి తోడు మంచు మనోజ్‌తో జరిగిన ఫ్యామిలీ పంచాయితీ కూడా కాస్త ఎఫెక్ట్ చూపించింది. ఆ పూర్తి ఎపిసోడ్‌లో మంచు మనోజ్‌కే సింపతీ వచ్చింది అనేది అందరికీ తెలిసిందే.
బిజినెస్ పరంగా ఆలోచించాల్సింది..
సినిమాపై హీరోకు డైరెక్టర్ నమ్మకం ఉండటం సహజం. కానీ, ఆ నమ్మకం వల్ల సినిమాకు నష్టం జరగకుండా ఉంటే చాలు. ఇది ఇక్కడ ఎందుకు అంటే, సినిమాపై నమ్మకం వల్ల కన్నప్ప బిజినెస్ విషయంలో మంచు విష్ణు తీసుకునే స్టెప్స్ రిస్కీ అనిపిస్తున్నాయి.
నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు వస్తే… తక్కువ కోట్ చేశాయని వాటిని రిటర్న్ చేశాడట. సినిమా రిలీజ్ అయ్యాకా భారీ మొత్తంలో డిమాండ్ చేయొచ్చు అని వాటిని రిజెక్ట్ చేశారడట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే చెప్పాడు. సినిమా హిట్ అయితే పర్లేదు. ఓటీటీ బిజినెస్ తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ, ఇప్పటికే ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్న ఈ మూవీకి నెగిటివ్ టాక్… లేదా మిక్సిడ్ టాక్ వస్తే పరిస్థితేంటో మరి మంచు విష్ణుకే తెలియాలి.
అలాగే థియేట్రికల్ బిజినెస్‌లో కూడా విష్ణు తొందర పడ్డాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా రైట్స్‌ను అందరికీ ఫ్రీ రిలీజ్ పద్దతిలో ఇచ్చేశాడు. అంటే బయ్యర్ల నుంచి ముందుగా కన్నప్ప నిర్మాతలకు ఒక్క రూపాయి కూడా రాదు. వచ్చిన కలెక్షన్లు, వాటిలో నుంచి బయ్యర్లకు షేర్ పోతుంది. అలా ఫైనల్ గా వచ్చిందే నిర్మాతల చేతికి.
కానీ, ఇది చాలా రిస్క్. పైన చెప్పినట్టు మిక్సిడ్ టాక్. నెగిటివ్ టాక్ వస్తే… సినిమాను కాపాడటం ఆ శివయ్యాతో కూడా అవ్వదు.