Manchu Vishnu: ఈమధ్య కాలంలో హీరోలు ఒకే మార్గంలో ప్రయాణం చేయకుండా.. వివిధ మార్గాలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే హీరోగా చేసిన చాలామంది నిర్మాతలుగా, దర్శకులుగా మారుతుంటే.. దర్శకులుగా చేసిన కొంతమంది నటులుగా అవతారం ఎత్తుతున్నారు. ఇంకొంతమంది సినీ రంగాన్ని వదిలి రాజకీయరంగం లేదా ఇతర బిజినెస్ ల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఒకే మార్గంలో కాకుండా వివిధ మార్గాలలో అడుగులు వేస్తూ.. తమ టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు వారసుడు విష్ణు (Manchu Vishnu) కూడా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం విని అవమానులు ఆశ్చర్యపోయినా.. నటుడిగా ఆయన గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విడుదలకు సిద్ధమైన కన్నప్ప మూవీ..
‘మహాభారతం’ సీరియల్ తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) దర్శకత్వంలో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa). జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), మంచు విష్ణు, మోహన్ బాబు(Mohan Babu), మోహన్ లాల్ (Mohan Lal), మధుబాల(Madhubala), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), బ్రహ్మానందం(Brahmanandam), సప్తగిరి(Saptagiri )తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా ద్వారా మంచు విష్ణు కొడుకుతోపాటు కూతుర్లు అరియానా(Ariana), వివియానా(Viviana) కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
నటుడిగా విష్ణు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నారా?
ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన మంచు విష్ణు తాను నటుడిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపారు. ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు తన మనసులో ఉన్న కోరికను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా మీరు డైరెక్షన్ వైపు వెళ్తారా? ఒకవైపు వెళ్తే ఎవరితో సినిమా చేస్తారు? అని ప్రశ్నించగా ఊహించని సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఆ హీరోని దర్శకత్వం చేస్తా – మంచు విష్ణు
మంచు విష్ణు మాట్లాడుతూ.. “నాకు దర్శకుడు అవ్వాలనే కోరిక ఉంది. ఒకవేళ ఆ వైపు అడుగులు వేస్తే.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సినిమాకి డైరెక్టర్గా పనిచేస్తాను. అది నా కల. గత ఏడాది వచ్చిన ‘కల్కి’ సినిమాలో ఆయన అశ్వద్ధామ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు”. అంటూ మంచు విష్ణు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే నటుడిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి, దర్శకుడిగా మారుతారా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మంచు విష్ణు కామెంట్స్ విన్న మరికొంతమంది మొత్తానికి బిగ్ బీ కే ఎసరు పెట్టారు.. ఏం ప్లాన్ చేశావయ్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మంచు విష్ణు కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
విష్ణు కన్నప్ప మూవీకి తప్పని తిప్పలు..
తాజాగా సెన్సార్ కోసం వెళ్లిన ఈ సినిమాకి చిక్కులు ఎదురయ్యాయని చెప్పాలి. అందులో భాగంగానే రివిజన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో 13 కీలక సన్నివేశాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు 183 నిమిషాల నిడివితో రన్ టైం బ్లాక్ చేయగా.. అందులో 12.11 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లు సమాచారం.
ASLO READ:Roja Ramani: ఏంటీ.. తరుణ్, ఆర్తి పెళ్లి చేసుకోవాలనుకున్నారా.. ఇన్నాళ్లకు నిజం చెప్పిన తరుణ్ తల్లి!