BigTV English

Yashasvi Jaiswal : 4 క్యాచ్ లు మిస్ చేసి… ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేస్తున్న యశస్వి జైశ్వాల్.. బీసీసీఐ సీరియస్

Yashasvi Jaiswal : 4 క్యాచ్ లు మిస్ చేసి… ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేస్తున్న యశస్వి జైశ్వాల్.. బీసీసీఐ సీరియస్

Yashasvi Jaiswal : యశస్వి  జైస్వాల్(Yashasvi Jaiswal)   బ్యాటింగ్ లో అదురగొట్టిన విషయం తెలిసిందే. ఓపెనర్ గా తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కాస్త విఫలం చెందాడు. బ్యాటింగ్ లో మంచి శుభారంభాన్ని ఇచ్చిన ఈ ఆటగాడు ఫీల్డింగ్ లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. నిన్న జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 4 క్యాచ్ లు మిస్ చేశాడు. జైస్వాల్ క్యాచ్ లు మిస్ చేయకుండా.. టీమిండియా బౌలర్లు రాణించినట్టయితే ఇంగ్లాండ్ పై విజయం సునయాసం అయ్యేది. కానీ జైస్వాల్ తన చెత్త ఫీల్డింగ్ తో టీమిండియా విజయానికి అడ్డుకుంటున్నాడనే చెప్పవచ్చు. ఇంగ్లాండ్ తో జరిగిన లీడ్స్ టెస్ట్ లో నాలుగు క్యాచ్ లు మిస్ చేసి విమర్శల పాలవుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో మూడు క్యాచ్ లు జారవిడిచాడు. రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన డకౌట్ క్యాచ్ అందుకోవడంలో విఫలం చెందాడు.


Also Read : Esha Gupta – Hardik: మరో హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా పెళ్లి… వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్

4 క్యాచ్ లు మిస్.. 


డకెట్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జైస్వాల్ క్యాచ్ మిస్ చేశాడు. మ్యాచ్ ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు యశస్వి జైస్వాల్. దీంతో యశస్వి జైస్వాల్ పై బీసీసీఐ సీరియస్ అయినట్టు సమాచారం. ప్రధానంగా భారత్ వికెట్లు పడక ఇబ్బంది పడుతుంటే దొరక్క దొరక్క వచ్చిన అవకాశాలను జైస్వాల్ పదే పదే క్యాచ్ లను వదిలేయడంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన షార్ట్ బంతిని డకెట్ పుల్ షాట్ ఆడాడు. టైమింగ్ సరిగ్గా కుదరకపోవడంతో బాల్ అక్కడే లేచింది. మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి జైస్వాల్ పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసినా మాత్రం ఫలితం లేకుండా పోయింది. 97 పరుగుల వద్ద లైఫ్ వచ్చిన ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ సెంచరీతో ఇంగ్లాండ్ ను ముందుకు తీసుకెల్లాడు.

ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తో యశస్వి ఎంజాయ్..! 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ ఇండియా జట్టు 471 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీ చేశారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 101, శుబ్ మన్ గిల్ 147, రిషబ్ పంత్ 134 పరుగులు చేసి భారత్ కి మంచి స్కోర్ ని అందించారు. ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ 365 పరుగులు చేసింది. పోప్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. డకట్ 62 పరుగులు చేసిన తరువాత బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ భారత్ తరపున కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో  371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 373 పరుగులు చేసి విజయం సాధించింది. డకెట్ 149, క్రాజ్లె 65, రూట్ 53 నాటౌట్, జెమీ స్మిత్ 44 నాటౌట్ గా నిలిచారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్ కూడా బాగానే చేశాడు. అతని కెప్టెన్సీలోనే టీమిండియా తొలి టెస్ట్ విజయం సాధించింది. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ జైస్వాల్ పై ట్రోలింగ్స్ చేయడం విశేషం. కొందరూ అయితే ఇంగ్లాండ్ ఫ్యాన్స్ యశస్వి ఎంజాయ్ చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్ ప్రైవేట్ పార్ట్స్ పైనే దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి గిల్, సిరాజ్ ఔట్… టీమిండియా తుది జట్టు ఇదే !

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Nayanthara: ‘నయన్’ ఎ**ఫైర్ లిస్ట్ పెద్దదే..లిస్ట్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు ?

Big Stories

×