E-Paper
Advertisement

మెగా ఇంట ‘పెద్ది’ సెలబ్రేషన్స్..హోరెత్తిపోయిన చరణ్ హోమ్ స్టాఫ్ మాస్ స్టెప్పులు.. క్లీంకార వాయిస్ ఓవర్ కేక!

మెగా ఇంట ‘పెద్ది’ సెలబ్రేషన్స్..హోరెత్తిపోయిన చరణ్ హోమ్ స్టాఫ్ మాస్ స్టెప్పులు.. క్లీంకార వాయిస్ ఓవర్ కేక!

peddi success: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, చరణ్ మాస్ ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సందర్భంగా ఆయన నివాసంలో అదిరిపోయే సర్‌ప్రైజ్ సెలబ్రేషన్స్ జరిగాయి.చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ఆధ్వర్యంలో, వారి ముద్దుల కుమార్తె క్లీంకార మరియు ఇంటి సిబ్బంది అంతా కలిసి మెగా హీరోకు ఒక మెమరబుల్ గిఫ్ట్ ని అందించారు. ఇందుకు సంబంధించిన ఒక స్పెషల్  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సాధారణంగా సినిమాల విజయాలను చిత్ర యూనిట్ లేదా అభిమానులు థియేటర్ల వద్ద సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాం. కానీ, రామ్‌చరణ్ నివాసంలో జరిగిన ఈ వేడుక మాత్రం వెరీ స్పెషల్ గా నిలిచింది. చరణ్ ఇంటి గార్డెన్ ఏరియాతో పాటు లోపలి ప్రాంగణంలో ఆయన పర్సనల్ స్టాఫ్, అపోలో హాస్పిటల్స్ సిబ్బంది, వంట మనుషులు, బాడీగార్డ్స్ మరియు ఇతర సపోర్టింగ్ స్టాఫ్ అంతా కలిసి ‘పెద్ది’ చిత్రంలోని ఫేమస్ మాస్ హుక్ స్టెప్పులను రీ-క్రియేట్ చేశారు. సినిమాలో చరణ్ వేసిన ఐకానిక్ మూమెంట్స్‌ను, ఆయన సిగ్నేచర్ డ్యాన్స్ స్టైల్‌ను వీరంతా ఎంతో ఉత్సాహంగా ఇమిటేట్ చేసిన హంగామా ఫ్యాన్స్ కి మాంచి కిక్కిస్తుంది.ముఖ్యంగా వీడియో చివర్లో రామ్‌చరణ్ వ్యక్తిగత బాడీగార్డ్‌తో పాటు మరికొందరు సిబ్బంది క్రికెట్ బ్యాట్లు పట్టుకుని, సినిమాలో హీరో పవర్ ఫుల్ గా ఫోజులిచ్చే క్రికెట్ సీన్‌ను రీ-క్రియేట్ చేయడం ఈ వీడియోకే పెద్ద అసెట్‌ అని చెప్పాలి.

also read :ఆ లవ్ అఫైర్స్ నాకొద్దు అంటున్న క్రేజీ హీరోయిన్…ఆ ఆలోచనే లేదంటూ క్లియర్ కట్ వార్నింగ్!

”నాన్నా.. దిస్ ఈజ్ ఫర్ యూ నాన్నా.. ఐ లవ్ యూ సో మచ్’’

అయితే, ఈ మొత్తం వీడియోలోనే అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే  బ్యాక్‌గ్రౌండ్‌లో తన అమాయకమైన గొంతుతో ‘‘నాన్నా.. దిస్ ఈజ్ ఫర్ యూ నాన్నా.. ఐ లవ్ యూ సో మచ్’’ అంటూ క్లీంకార ముద్దు ముద్దుగా చెప్పడం .తండ్రి సాధించిన ఇంతటి భారీ విజయాన్ని, ఇంత చిన్న వయసులోనే ఆ పాప తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకోవడంఈ సర్‌ప్రైజ్ మొత్తాన్ని ‘ది స్వీటెస్ట్ సెలబ్రేషన్’గా మార్చేసింది. గతేడాది జూన్ 20న జన్మించిన క్లీంకార, ఇప్పుడు తన తండ్రి కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిన సినిమా సక్సెస్ లో ఇలా భాగస్వామి కావడం మెగా కుటుంబంలో సరికొత్త జోష్ నింపింది.

ఫుల్ ఖుషీ అవుతున్న మెగా ఫ్యాన్స్ 

రామ్‌చరణ్ గతంలో నటించిన ‘మగధీర’ (2009), ‘రంగస్థలం’ (2018), మరియు గ్లోబల్ సెన్సేషన్ ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ‘పెద్ది’ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ చరణ్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని స్టాఫ్ అంతా కలిసి చేసిన ఈ డ్యాన్స్ ట్రిబ్యూట్ వీడియోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అది చూసిన మెగాభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో లైకులు, షేర్ల వర్షం కురిపిస్తూ ఈ వీడియోను టాప్ ట్రెండింగ్‌లో నిలిపారు. రామ్‌చరణ్ క్రేజ్ మరియు ఆయన సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో మరోసారి నిరూపించాయి ఈ సెలబ్రేషన్స్ .

also read :జాన్వీ టు మీనాక్షి.. టాలీవుడ్‌లో గ్లామర్ బొమ్మలుగానే హీరోయిన్లు?

Tags

Related News

మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. జక్కన్న సినిమాలో ఊహించని ట్విస్ట్.. ఆ అరగంట సీన్ హిస్టరీలోనే నిలిచిపోతుందా?

జాన్వీ టు మీనాక్షి.. టాలీవుడ్‌లో గ్లామర్ బొమ్మలుగానే హీరోయిన్లు?

ప్రభాస్ తండ్రి వద్దన్నా వినలేదు.. ఆ డైరెక్టర్ వల్ల రోడ్డున పడ్డ స్టార్ ప్రొడ్యూసర్స్!

ప్రశ్నించడం మా హక్కు.. నాగబాబుకు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్..

ఆ లవ్ అఫైర్స్ నాకొద్దు అంటున్న క్రేజీ హీరోయిన్…ఆ ఆలోచనే లేదంటూ క్లియర్ కట్ వార్నింగ్!

‘పెద్ది’ వివాదంపై అనసూయ భరద్వాజ్ సెన్సేషన్ కామెంట్స్…. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!

విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’ క్రేజీ అప్‌డేట్.. 100 రోజుల షూటింగ్ పూర్తి, రిలీజ్ ఎప్పుడంటే?

Big Stories

×