E-Paper
Advertisement

జాన్వీ టు మీనాక్షి.. టాలీవుడ్‌లో గ్లామర్ బొమ్మలుగానే హీరోయిన్లు?

జాన్వీ టు మీనాక్షి.. టాలీవుడ్‌లో గ్లామర్ బొమ్మలుగానే హీరోయిన్లు?

Heroine Roles: ఇండియన్ సినీ  ఇండస్ట్రీలో, ముఖ్యంగా సౌత్ లో  హీరోయిన్ల పాత్రల చుట్టూ జరుగుతున్న చర్చ ఇప్పుడు ఒక సరికొత్త డిబేట్ కి దారితీస్తుంది. గ్లామర్ వర్సెస్ పెర్ఫార్మెన్స్ అనే కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలుస్తుంది.తాజాగా బెస్ట్ ఎగ్జాంపుల్ జాన్వీ కపూర్.యస్ ..శ్రీదేవి వారసురాలిగా సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. బాలీవుడ్‌లో ‘మిలీ’, ‘గుంజన్ సక్సేనా’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినప్పటికీ, అవి ఆశించిన వాణిజ్య విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే  ఆమె కమర్షియల్ రూట్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఆమె చేసిన తంగం పాత్ర కథను మలుపు తిప్పుతుందని ప్రచారం జరిగినప్పటికీ, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కేవలం కొన్ని పాటలకే పరిమితమైందనే విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా రాంచరణ్ సరసన నటించిన పెద్ది సినిమాలో రూటెడ్ పీరియడ్ డ్రామా ఆశించిన ప్రేక్షకులకు డిసప్పాయింట్ మిగిలింది. క్యారెక్టర్ ఎలివేషన్ కంటే అతిగా  గ్లామర్, రొమాంటిక్ ట్రాక్‌లకే ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం రేగింది. ఈ నెగిటివిటీ వల్ల దర్శకుడు బుచ్చిబాబు సానా కొన్ని సీన్లను ట్రిమ్ చేస్తామని ప్రకటించాల్సి రావడం గమనార్హం.

రొమాంటిక్ సీన్స్, డ్యూయెట్లకే పరిమితం అవుతున్న భామలు

కేవలం జాన్వీ కపూర్ మాత్రమే కాదు, టాలీవుడ్‌లో ఈమధ్య  ఎంట్రీ ఇచ్చిన అందాల భామల పరిస్థితి అందరిది అలాగే ఉంది. టాలెంట్ ఉన్నప్పటికీ కమర్షియల్ విలువల పేరుతో వారి పాత్రల నిడివిని, ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో గ్లామర్ సెన్సేషన్‌గా మారిన భాగ్యశ్రీ బోర్సేకు కాంత, కింగుడమ్, ఆంధ్రా కింగ్ తాలూకా వంటి పెద్ద ప్రాజెక్టులు దక్కినప్పటికీ, ఆమె కేవలం రొమాంటిక్ సీన్స్, డ్యూయెట్లకే పరిమితం అవుతోందనే ఆందోళన అభిమానుల్లో ఉంది. అఖిల్ సరసన నటిస్తున్న లెనిన్ చిత్రమైనా ఆమెకు నటనకు స్కోప్ ఇస్తుందో లేదో చూడాలి.

also read :ఆ లవ్ అఫైర్స్ నాకొద్దు అంటున్న క్రేజీ హీరోయిన్…ఆ ఆలోచనే లేదంటూ క్లియర్ కట్ వార్నింగ్!

కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారా 

మరోవైపు ఏజెంట్ మూవీతో పరిచయమైన సాక్షి వైద్యను కేవలం గ్లామర్ కోణంలోనే చూపిస్తున్నారు తప్ప, యాక్టింగ్ పొటెన్షియల్‌ను వాడుకోవడం లేదు. ఇదే క్రమంలో మీనాక్షి చౌదరి గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా వంటి వరుస క్రేజీ చిత్రాలు చేసినా, ఆమె స్క్రీన్ టైమ్ వేళ్ల మీద లెక్కపెట్టేలా ఉంటోంది. కథను నడిపించే లీడ్ కాకుండా, కేవలం లవ్ ఇంట్రెస్ట్ ట్యాగ్‌కే పరిమితం చేస్తున్నారు. కోలీవుడ్ చిత్రం బ్లాస్ట్‌లో మార్షల్ ఆర్ట్స్ క్వీన్‌గా అద్భుతమైన పవర్‌ఫుల్ పాత్ర చేసిన ప్రీతి ముకుందన్‌ను, టాలీవుడ్ భంతిరస చిత్రం కన్నప్పలో చూపించిన తీరుపై తీవ్రమైన ట్రోలింగ్ నడిచింది. ఇతర  పరిశ్రమలో నటనకు ప్రాధాన్యత ఇస్తుంటే, ఇక్కడ కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం బాబీ-చిరంజీవి కాంబినేషన్ చిత్రంలో ఆమెకు దక్కే పాత్రపైనే అందరి దృష్టి ఉంది.

గ్లామర్ కల్చర్‌ను ఒంటబట్టించుకుంటున్న సౌత్ 

ఒకప్పుడు ఎన్నో గొప్ప గొప్ప లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. కానీ ఇప్పటి భారీ కమర్షియల్ చిత్రాల్లో ఆ బ్యాలెన్స్ లేనట్టు కనిపిస్తుంది.హీరోయిన్లను కేవలం హీరోలతో యాడి పాడే ఆటబొమ్మలుగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు ఎమోషన్స్ కి కేరాఫ్ గా ఉండే ఉన్న దక్షిణాది సినిమాలు, ఇప్పుడు బాలీవుడ్ గ్లామర్ కల్చర్‌ను ఒంటబట్టించుకుని  కథలను పక్కదారి పట్టిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్ల వల్లే తాము ఇలాంటి పాత్రలు చేయాల్సి వస్తోందని తారలు  లోలోన వాపోతున్నప్పటికీ, స్టార్ స్టేటస్ వచ్చాక కూడా గ్లామర్ వైపే మొగ్గు చూపడం వారి స్వయంకృతమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనా  కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు బలమైన పాత్రల మధ్య సరైన బ్యాలెన్స్ కుదిరినప్పుడే వెండితెరపై నాయికలకు నిజమైన గౌరవం దక్కుతుంది.చూడాలి ముందు ముందు ఈ ట్రెండ్ ఏమైనా రూపు మార్చుకుంటుందేమో !

also read :ప్రభాస్ తండ్రి వద్దన్నా వినలేదు.. ఆ డైరెక్టర్ వల్ల రోడ్డున పడ్డ స్టార్ ప్రొడ్యూసర్స్!

Related News

మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. జక్కన్న సినిమాలో ఊహించని ట్విస్ట్.. ఆ అరగంట సీన్ హిస్టరీలోనే నిలిచిపోతుందా?

మెగా ఇంట ‘పెద్ది’ సెలబ్రేషన్స్..హోరెత్తిపోయిన చరణ్ హోమ్ స్టాఫ్ మాస్ స్టెప్పులు.. క్లీంకార వాయిస్ ఓవర్ కేక!

ప్రభాస్ తండ్రి వద్దన్నా వినలేదు.. ఆ డైరెక్టర్ వల్ల రోడ్డున పడ్డ స్టార్ ప్రొడ్యూసర్స్!

ప్రశ్నించడం మా హక్కు.. నాగబాబుకు ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్..

ఆ లవ్ అఫైర్స్ నాకొద్దు అంటున్న క్రేజీ హీరోయిన్…ఆ ఆలోచనే లేదంటూ క్లియర్ కట్ వార్నింగ్!

‘పెద్ది’ వివాదంపై అనసూయ భరద్వాజ్ సెన్సేషన్ కామెంట్స్…. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్!

విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’ క్రేజీ అప్‌డేట్.. 100 రోజుల షూటింగ్ పూర్తి, రిలీజ్ ఎప్పుడంటే?

Big Stories

×