SS Rajamouli :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకొని, ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). మరొకవైపు రాజమౌళి చిత్రాలతో పాటూ యంగ్ అండ్ స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు ఎమ్.ఎమ్.కీరవాణి (M.M.Keeravani). వీరిద్దరూ అన్నదమ్ముల అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమ పని తాము చేసుకుంటూ విమర్శలకు దూరంగా ఉండే కీరవాణిపై ఇటీవల ‘పాడుతా తీయగా’ షోలో సింగర్ ప్రవస్తి (Singer Pravasthi) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
పాడుతా తీయగా షోలో అవమానం జరిగిందంటున్న ప్రవస్తి..
అసలు విషయంలోకెళితే.. స్వర్గీయ దివంగత గాయకులు, సంగీత దర్శకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubramaniam) నేతృత్వంలో ప్రారంభమైన ‘పాడుతా తీయగా’ ఇటీవల 25 వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సీజన్ కూడా ఘనంగా జరుగుతోంది. ఇక ఈ సీజన్ కి సంబంధించి ఎంతోమంది తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 25 వసంతాలుగా నిర్విరామంగా షో ను కొనసాగిస్తుండగా.. సడన్గా ఈ షోపై ఆరోపణలు చేసింది ప్రముఖ సింగర్ ప్రవస్తి..ఈ షో కి జడ్జిలుగా ఎం ఎం కీరవాణి , చంద్రబోస్(Chandrabose ), సింగర్ సునీత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తనను సింగర్ సునీత అగౌరవపరిచింది అని, తన తల్లిని ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు చేసింది ప్రవస్తి.
కీరవాణి పై ప్రవస్తి ఆరోపణలు ..
అంతేకాదు ఎం ఎం కీరవాణి కూడా తనను బాడీ షేమింగ్ చేశారు అని, అసభ్యకరంగా చూసేవారని, తక్కువ చూపు చూశారు అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీంతో కీరవాణిపై కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా డైరెక్టర్ గీతాకృష్ణ లాంటి వాళ్ళు కూడా కీరవాణి పై కామెంట్లు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ప్రముఖ కొరియోగ్రాఫర్లు కూడా ప్రవస్తికి సపోర్టుగా నిలిచారు. దీంతో కొంతమంది కీరవాణికి మద్యం అలవాటు ఉంది.. ఆ మద్యం మత్తులో చేసినా చేసుంటారు అని కొంతమంది కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అలా వార్తలు వైరల్ అయిన సందర్భంలో ఆయన అభిమానులు మాత్రం కీరవాణి మద్యం సేవించడం ఏంటి? అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీరు బాటిల్ తో అడ్డంగా దొరికిపోయిన రాజమౌళి, కీరవాణి..
అయితే కీరవాణి మద్యం సేవిస్తున్నట్లు.. తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు కూడా నిజమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే .. తాజాగా రాజమౌళి, ఎంఎం కీరవాణి, రాజమౌళి భార్య రమా రాజమౌళి(Rama Rajamouli)తో పాటు ఇంకొక వ్యక్తి ఒక పార్టీ చేసుకుంటున్నారు. అందులో కింద నుంచి ఎం ఎం కీరవాణి సైగ చేయగా.. పక్కనే ఉన్న వ్యక్తులు బీర్ బాటిల్ తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఏంటి కీరవాణికి, రాజమౌళికి మద్యం అలవాటు ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు
అది బీరా ? గోళీ సోడానా ?
అయితే ఈ వీడియోని కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే.. అది బీరు కాదని గోళీ సోడా అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో కీరవాణి పక్కన ఉంచినది బీరు.. రాజమౌళి పక్కన ఉంచినది గోళీ సోడా అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వీరికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు పలు అనుమానాలకు దారితీస్తోంది.
ALSO READ:July Month Re-Release Movies : ఒక్క నెలలో ఇన్ని రీ-రిలీజ్‌లా ? మీ ఫేవరెట్ మూవీ ఉందేమో చూడండి
బీర్ వేస్తూ… అలా మటన్ కుమ్ముతే.. వావ్ అంతే #SSRajamouli #MMKiravani #SSMB29 @ssrajamouli @mmkeeravaani pic.twitter.com/0pgtJXHoV7
— Gajala From Washington DC (@GajalaFrmWDC) June 24, 2025