BigTV English
Advertisement

Mango Leaves: పూజలకు, పండుగలకు మామిడి ఆకు ఉండాల్సిందే.. దాని స్పెషల్ ఎంటో తెలుసా..?

Mango Leaves: పూజలకు, పండుగలకు మామిడి ఆకు ఉండాల్సిందే.. దాని స్పెషల్ ఎంటో తెలుసా..?

Mango Leaves: ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిన, పండగలు వచ్చిన ప్రతి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. మామిడి ఆకులకు మన హిందూ సంప్రదాయంలో, ఆచారాల్లో ప్రత్యేక స్థానం ఇస్తారు. అయితే ఈ ఆకులు కేవలం అలంకరణకు మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని పలు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిందూ మతంలో చెట్లు, మొక్కలను పూజిస్తారు. ఎందుకంటే వాటిల్లో దేవతలు, దేవుళ్లు నివసిస్తారని నమ్ముతారు.


శుభకార్యాలలో మామిడి ఆకులు:
అయితే ముఖ్యంగా పూజలో మామిడి చెట్టు, కలప, ఆకులను ఉపయోగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు శాస్త్ర ప్రకారం కూడా మామిడి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మామిడి చెట్టు ఆకులను మహాలక్షీ దేవి, ప్రేమతో సంబంధం కలిగి ఉంటుంది. మామిడి ఆకులు సంతానోత్పత్తికి చిహ్నంగా భావిస్తారు. శుభకార్యాలలో మామిడి ఆకులు ఉపయోగిస్తే విజయం, ఆనందం, శాంతి నెలకొంటాయి. ఇవి అంగారక గ్రహంతో ముడిపడి ఉంటాయని చెబుతారు.

నరదృష్టి తొలగేందుకు:
పండగలు వచ్చాయంటే తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు కట్టుకుంటారు. ఇంటి ప్రధాన ద్వారం మొత్తం మామిడి ఆకుల తోరణాన్ని ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో సానుకూలత, శుభకార్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతాయి. సంతోషం, శ్రేయస్సు ఇంట్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయి.


సంపద పొందేందుకు:
వాస్తు ప్రకారం పూజ చేసేటప్పుడు మామిడి ఆకులతో నీటిని చల్లడం వల్ల డబ్బు కొరత తొలగిపోతుంది. సంపద ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

వినాయకుడికి మామిడి ఆకులు:
శుభకార్యాలలో వినాయకుడికి మామిడి ఆకులను సమర్పించడం వల్ల వ్యక్తి జీవితంలో సంతోషానికి ఎప్పుడు లోటు ఉండదు. అలాగే ఇంట్లో సంపద శ్రేయస్సు లభిస్తుంది. పూజ సమయంలో ఇంట్లో ఉన్న పూజాగదిని మామిడి ఆకులతో అలంకరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందని తెలిపారు.

వృత్తిలో విజయం కోసం:
వృత్తిలో ఆటంకాలు ఎదుర్కోలేక పోతున్నారా? అయితే మామిడి ఆకులతో ఈ పరిహారం పాటించి చూడండి. మీ వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. మామిడి చెట్టు వేళ్లపై నీరు పోసి మామిడి చెట్టుకి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల కెరీర్ కు సంబంధించిన సమస్యలు తొలగిపోయి విజయమార్గాలు తెరుచుకుంటాయి. వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయని పలు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: చార్‌కోల్ ఇడ్లీ ఏంటీ అనుకుంటున్నారా? తింటే ఎన్ని ప్రయోజనాలో..

ఇంటి వాకిట్లో మామిడి తోరణం ఎలా కట్టాలి?

మామిడి తోరణాలను కట్టడానికి ఒక పద్దతి ఉంటుంది. ముందుగా పసుపు రాసిన దారానికి మామిడి ఆకులను తోరణంగా కట్టుకోవాలి. అలాగే ఈ మామిడి ఆకులకు పసుపు రాసి, దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి. దీన్ని నీడలో ఆరబెట్టి ఇంటి వాకిట్లో కట్టాలని చెప్తారు. అంతేకానీ మామిడి తోరణాన్ని అలాగే కట్టకూడదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

మామిడి తోరణంలో 11 మామిడి ఆకులను మాత్రమే వాడాలి. ఇంతకంటే ఎక్కువైతే 21 లేదా 101 ఆకులతో తోరణాన్ని ఏర్పాటు చేసి కట్టాలి.

Related News

Parenting Tips: మీ పిల్లలు అన్నింట్లో ముందుండాలా ? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి !

Coffee Face Mask: కాఫీ ఫేస్ మాస్క్‌తో.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Vertigo Problem: రోజూ నిద్రలేవగానే తల గిర్రుమంటోందా.. వర్టిగో గురించి తెలియాల్సిన సమయమిదే!

 Ajwain Seed Water: వాము నీరు తాగితే.. నమ్మలేనన్ని లాభాలు !

Cracked Heels: మడమల పగుళ్లకు అసలు కారణాలు తెలిస్తే.. షాక్ అవుతారు

Rainbow Puri: రెయిన్‌బో పూరీ..ఇలా తయారు చేసుకుని తింటే అదిరిపోయే టేస్ట్

Kothmira Pachadi: నోరూరించే కొత్తిమీర పచ్చడి.. సింపుల్‌గా ఇలా తయారు చేయండి !

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Big Stories

×