July month Re releasing movies: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు విడుదలయ్యే సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలే ప్రజెంట్ సినిమాలను బీట్ చేస్తున్నాయి. అలా రీ రిలీజ్ ల కారణంగా చాలా సినిమాలు నష్టపోయాయి. ఇక కొన్ని సినిమాలైతే విడుదలైన సమయంలో అట్టర్ ప్లాఫ్, డిజాస్టర్ అయ్యి రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయినవి ఎన్నో ఉన్నాయి. అలా ఖలేజా (Khaleja), ఆరెంజ్ (Orange)వంటి సినిమాలను చెప్పుకోవచ్చు. ఇలా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో ఈనెల చివర్లో అలాగే వచ్చే నెలలో వరుస సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. మరి ఏ సినిమా? ఏ తేదీన రీ రిలీజ్ కాబోతోందో? ఇప్పుడు చూద్దాం.
చాలామంది నిర్మాతలు ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సినిమాలు మాత్రం వరుసగా రీ రిలీజ్ కాబోతున్నాయి.
అందులో కుమారి 21 f,హనుమాన్ జంక్షన్, గజిని, మిరపకాయ్, వీడొక్కడే, ఏ మాయ చేసావే వంటి సినిమాలు ఉన్నాయి. ఇందులో మొదటగా జూన్ 28న జగపతిబాబు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కాంబోలో వచ్చిన హనుమాన్ జంక్షన్ (Hanuman Junction) సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. అంతేకాదు ఈ సినిమా విడుదలైనప్పుడే ఎవరూ పట్టించుకోలేదు.. ఇప్పుడెవరు చూస్తారని కొంతమంది మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. కానీ ఈ సినిమాలోని ఫన్ చాలామంది ఎంజాయ్ చేస్తారు.కాబట్టి రీ రిలీజ్ లో ఈ సినిమాకి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది..
కుమారి 21ఎఫ్..
ఇక రాజ్ తరుణ్ , హెబ్బా పటేల్ నటించిన రొమాంటిక్ మూవీ కుమారి 21ఎఫ్(Kumari 21F).. ఈ సినిమా విడుదలైన సమయంలో యూత్ అందరికీ ఫేవరెట్ అయిపోయింది.అలా యూత్ మెచ్చిన కుమారి 21ఎఫ్ మూవీని మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. అలా ఈ సినిమా జూలై 10వ తేదీన రీ రిలీజ్ కాబోతోంది..
మిరపకాయ్..
ఇక మాస్ మహారాజ్ రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ లు కలిసి నటించిన మిరపకాయ్ (Mirapakai) మూవీ. 2011లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాను మళ్ళీ జూలై 11న రీ రిలీజ్ చేయబోతున్నారు. అలా ఒక్క రోజు తేడాతో కుమారి 21F, మిరపకాయ్ రెండు సినిమాలు రాబోతున్నాయి.ఏ మాయ చేసావే..
ఏ మాయ చేసావే..
రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న మరో మూవీ ఏ మాయ చేసావే.. ఈ సినిమాతో ఎంతో మంది యూత్ చై – సామ్ లకు అభిమానులయ్యారు. అలా మొదటి సినిమా సమంత(Samantha)కు ఎంతో క్రేజ్ పెట్టింది.. ఏ మాయ చేసావే సినిమా(Ye Maya Chesave Movie)తో యూత్లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు.. అయితే అలాంటి ఈ మూవీని జూలై 18న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
గజిని..
అలాగే ఎంతోమంది స్టార్స్ రిజెక్ట్ చేసిన గజినీ స్టోరీ చేసి హిట్ కొట్టిన సూర్య మరొక్కసారి మన ముందుకు రాబోతున్నారు.. మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన గజిని మూవీ (Gajini Movie) జూలై 18న తెలుగు వెర్షన్ లో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో అసిన్(Asin), నయనతారలు హీరోయిన్లుగా నటించారు.. ఇక గజిని, ఏ మాయ చేసావే రెండు సినిమాలు ఒకే రోజు రీ రిలీజ్ కావడంతో ఏ సినిమా చూడాలని అభిమానుల్లో కాస్త గందరగోళం అయితే నెలకొంది.
వీడొక్కడే..
ఇక చివరిగా వీడొక్కడే (veedokkade).. తమన్నా,సూర్య కాంబోలో 2009లో తెరకెక్కిన వీడొక్కడే సినిమా విడుదలైన సమయంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇదే సినిమాను మళ్ళీ జూలై 19న రీ రిలీజ్ చేయబోతున్నారు. అలా ఒక్క రోజు తేడాతో సూర్య (Suriya) నటించిన రెండు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు వరుసగా రీ రిలీజ్ కాబోతుండడంతో ఈ సినిమాలన్నింటిలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటుందోనని అభిమానుల్లో క్యూరియాసిటీ ఉంది. మరి ఇన్ని సినిమాలు మళ్ళీ విడుదలవుతున్న వేళ మీరు ఏ మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
ALSO READ:Sriram Drugs Case : హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు అప్డేట్… 42 రెండు సార్లు డ్రగ్స్ తీసుకున్నాడు!