Varanasi Movie: దర్శక థీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏం చేసినా అది స్పెషల్ గానే ఉంటుంది. గ్లోబల్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ స్టార్ దర్శకుడు మొత్తం ఫోకస్ మహేష్ బాబుతో తను తెరకెక్కిస్తున్న ‘వారణాసి ’ పైనే ఉంది. తాజాగా ఈ సినిమాకు బడ్జెట్ కూడా దాదాపు వెయ్యి కోట్లు దాటుతోంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి ప్రచారానికి కేటాయించిన బడ్జెట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే.. దాదాపు రూ. 75 కోట్లు సినిమా ప్రమోషన్లు కోసమే కేటాయిస్తున్నడని టాక్. అది చూసిన నెటిజన్లు.. అదే నిజం అయితే ఆ బడ్జెట్ తో టాలీవుడ్ లో టాప్ రేంజ్ సినిమా తీయవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. అయినా రాజమైళి రేంజ్ బడ్చెట్ సినిమాకు రూ.75 కోట్లు సబబే అంటున్నారు మరి కొందరు. ఇంత పెట్టడం కరెక్టే అంటున్నారు మరి కొందరు. గ్లోబల్ రేంజ్ ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవ్వాలి అంటే ఈ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు నెటిజన్లు. మరి ఇంత కేర్ తీసుకుంటున్న ఈ సినిమా ఏ రేంజ్ రీచ్ ఉంటుందో చూడాలి మరి.
గతంలో రాజమౌళి సినిమాలు కేవలం ఇండియాలో హిట్టయితే సరిపోయేది. కానీ ‘RRR’ కు వచ్చిన ఆస్కార్ గుర్తింపు తర్వాత, ఇప్పుడు ఆయన టార్గెట్ హాలీవుడ్ గ్లోబల్ ఆడియన్స్. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, పెద్ద ఎత్తున పబ్లిసిటీ క్యాంపెయిన్స్ నిర్వహించడానికి ఈ బడ్జెట్ అవసరమని భావిస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని సమాచారం. ఇలాంటి సినిమాలకు విజువల్స్ మేకింగ్ వీడియోల ద్వారా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. రూ. 75 కోట్లు అనే భారీ మొత్తం కేవలం పోస్టర్ల కోసం కాదు, అంతర్జాతీయ స్థాయి ప్రచార చిత్రాల (Trailers & Teasers) కోసం ఖర్చు చేయబోతున్నారని టాక్.
Read also-Mad 3 : ‘మ్యాడ్ 3 ‘ లో అంతా కొత్త వాళ్లే.. ఈసారి ఊహించని స్టోరీతో మూవీ..
రాజమౌళి గారి దృష్టిలో ప్రమోషన్ అంటే కేవలం సినిమా గురించి చెప్పడం కాదు, ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేయడం. హాలీవుడ్ సినిమాలు తమ ప్రమోషన్స్ కోసం కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాయి. తెలుగు సినిమా కూడా అదే రేంజ్‌లో ఉండాలని, ఒక వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్‌గా దీన్ని ప్రెజెంట్ చేయాలని ఆయన భావిస్తున్నారు. మహేష్ బాబుకు సౌత్ ఇండియాలో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ సినిమాతో ఆయన్ని ప్రపంచ స్థాయి యాక్షన్ హీరోగా నిలబెట్టాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆయన లుక్ నుంచి, యాక్షన్ సీక్వెన్స్‌ల వరకు ప్రతిదీ భారీగా ప్రమోట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ప్రకటించడానికి ఆయన చేసిన ఈవెంట్ భారతీయ చరిత్రలో నిలిచే విధంగా చేశారు.