2026 Mega Movie’s:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ కి చెందిన మిగతా కుటుంబాల విషయానికి వస్తే.. మెగా కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. అందులో కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ అయితే.. మరి కొంత మంది గ్లోబల్ స్టార్స్ గా చలామణి అవుతున్నారు. ఇంకొంతమంది సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.అలా మెగాస్టార్ చిరంజీవితో మొదలైన ఈ మెగా ప్రస్థానం ఇప్పుడు మరింత జోరుగా కొనసాగుతోంది అని చెప్పవచ్చు.
సాధారణంగా ఒక కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం సహజమే. అయితే ఆ హీరోలంతా ఒకే ఏడాది సినిమాలు చేస్తే ఇంకేమైనా ఉందా. అభిమానులు ఎగిరి గంతెయ్యరు. అయితే ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుండి ఏకంగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు హీరోలకు సంబంధించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఎవరి సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.. వారెవరో కాదు చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మెగా ఫ్యామిలీకి ఆయువు పట్టు అయిన ఈ ముగ్గురు ఒకే ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిరంజీవి.. చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన భోళాశంకర్ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara ) హీరోయిన్గా నటిస్తోంది.
ALSO READ:Rashmika Mandanna: మనసులో కోరిక బయట పెట్టిన రష్మిక.. సాధిస్తుందా?
మెగా పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan)ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా బిరుదు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ తో పాటు వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. దీనితో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో వేగంగా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన అభిమానుల కోసం సినిమాలు చేస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వచ్చి విజయం అందుకోగా.. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల కాబోతోంది. ఇక ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. రాసి కన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలా మొత్తానికైతే ఈ ముగ్గురు హీరోలు కూడా వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారు. మరి ముగ్గురిలో ఎవరు ఎంత సత్తా చాటుతారో చూడాలి.