E-Paper
Advertisement

Pawan kalyan : పవన్ కళ్యాణ్ కు ఒక పొలిటికల్ స్క్రిప్ట్ చెబుతున్న డైరెక్టర్

Pawan kalyan : పవన్ కళ్యాణ్ కు ఒక పొలిటికల్ స్క్రిప్ట్ చెబుతున్న డైరెక్టర్
Advertisement

Pawan kalyan : సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడు నుంచో ఒక పర్ఫెక్ట్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా సక్సెస్ కొంత ఊరట ఇచ్చింది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

అసలు ఈ కాంబినేషన్ అంటేనే ఒక రకమైన హై ఉంటుంది. రీమేక్ సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేయగలిగిన కాంబినేషన్ ఇది. అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్. ఇకపోతే రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ నుంచి విడుదలైన ఒక వీడియో కూడా విపరీతమైన హై ఇచ్చింది. ఏప్రిల్ 26న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత మైత్రి రవి కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

పవన్ కళ్యాణ్ కోసం పొలిటికల్ స్క్రిప్ట్ 

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన అనే పార్టీని స్థాపించిన తర్వాత సినిమాల మీద తన ఆసక్తిని కొంతమేరకు తగ్గించేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత అసలు సినిమాలు చేయను అని కూడా చెప్పేశారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఏకైక ఇన్కమ్ సోర్స్ సినిమాలే కాబట్టి మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

బాక్సాఫీస్ వద్ద వకీల్ సాబ్ సినిమా వర్కౌట్ అయినా కూడా అప్పుడు ఉన్న టిక్కెట్ రేట్లు సందర్భంగా ఆ సినిమా నష్టాలను సరిచేసింది. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపు నష్టాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీని సిద్ధం చేస్తున్నాడు ఒక దర్శకుడు.

గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? 

Advertisement

పవన్ కళ్యాణ్ కోసం పొలిటికల్ స్టోరీ అంటే చాలామందికి ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన పరిధి మేరకు చేయవలసిన పనులన్నీ కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ స్క్రిప్ట్ వార్తలనేవి ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే దాని గురించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. పవన్ కళ్యాణ్ కోసం పొలిటికల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న ఆ దర్శకుడు ఎవరు అని ఫిలింనగర్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే స్టార్ హీరో మహేష్ బాబు చేసిన పొలిటికల్ సినిమా భరత్ అనే నేను బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ కి పడి ఉంటే బాగుండు అని ఇప్పటికే అనుకుంటూ ఉంటారు. మరి ఏ దర్శకుడైన ఆ ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.

Also Read: Peddi : రెహమాన్ హవా మొదలైంది, త‌మ‌న్‌, దేవిశ్రీ పోటీ ఎదుర్కోవాల్సిందే

Related News

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×