E-Paper
Advertisement

OTT Move: దొంగ గేమ్స్ ఆడి డబ్బు కొల్లగొట్టే కేటుగాళ్లు… చూసేకొద్దీ చూడాలనిపించే కొరియన్ మూవీ

OTT Move: దొంగ గేమ్స్ ఆడి డబ్బు కొల్లగొట్టే కేటుగాళ్లు… చూసేకొద్దీ చూడాలనిపించే కొరియన్ మూవీ
Advertisement

OTT Move : కొరియాలో బాదుక్ అనే గేమ్‌లో ఒక్క రాయి తప్పుగా పెడితే మొత్తం గేమ్ ఓడిపోతాం. అలాగే లైఫ్‌లో కూడా ఒక్క తప్పు మనల్ని, మన ఫ్యామిలీని నాశనం చేయొచ్చు. ఆ తప్పుని సరిచేయడానికి రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ఫైర్ కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ ‘ది డివైన్ మూవ్’. ఇది కొరియన్ సినిమా ఫ్యాన్స్‌కి కల్ట్ క్లాసిక్ గా మారిపోయింది. మాఫియా, జూదం ప్రధాన థీమ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాని, ఒక్కసారి చూడటం మొదలు పెడితే అస్సలు ఆపరు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ది డివైన్ మూవ్’ 2014లో వచ్చిన సౌత్ కొరియా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. చోయ్ డాంగ్-హూన్ డైరెక్షన్ లో ఇది తెరకెక్కింది. ఇందులో జంగ్ వూ-సంగ్ (హా-సూ), లీ బియోం-హున్ (సల్-సూ), కిమ్ ఇన్-క్వాన్, అన్ సియో-హ్యోన్, చోయి జిన్-హైయాక్ మెయిన్ రోల్స్ లో నటించారు.ఈ సినిమా 2014 జూలై 3న కొరియాలో రిలీజ్ అయింది. 118 నిమిషాల నిడివితో ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ని పొందింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హా-సూ అనే వ్యక్తి ఒక ప్రొఫెషనల్ బాదుక్ గేమ్ ప్లేయర్. బాదుక్ గేమ్‌ కొరియా దేశంలో జూదంలో భాగంగా వాడుతారు. అక్కడ ఈ గేమ్ బాగా పాపులర్ కూడా! అయితే హా-సూకి డబ్బు బాగా అవసరం ఉండటంతో అండర్‌ వరల్డ్‌లో రహస్యంగా జూదం ఆడాలనుకుంటాడు. ఒక రోజు సల్-సూ అనే భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌తో బాదుక్ గేమ్ ఆడతాడు. హా-సూ గెలుస్తాడు కానీ సల్-సూ ఓడిపోవడం జీర్ణించుకోలేడు. రివెంజ్ తీర్చుకోవడానికి హా-సూ ఇంటికి గూండాలు పంపి అతని భార్యని, పెద్దన్నని చంపేస్తాడు. హా-సూ తెరుకునేలోపు జరగాల్సిందంతా జరిగిపోతుంది. పోలీసులు అతన్నే మర్డర్ కేసులో అరెస్ట్ చేసి జైలుకి తోసేస్తారు. జైలులో హా-సూ 7 ఏళ్లు గడిపేస్తాడు. రోజూ బాదుక్ బోర్డు ముందు కూర్చుని ఒక్కటే ఆలోచిస్తాడు. సల్-సూ తన జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నేను అతన్ని నాశనం చేయాలని రగిలిపోతూ ఉంటాడు.

Read Also : ఏకంగా బాస్‌నే బుట్టలో వేసుకునే అమ్మాయి… ఎక్కడ పడితే అక్కడ … ఒంటరిగా చూడాల్సిన మూవీ

Advertisement

జైలులోనే అతనికి ఒక మాస్టర్ ప్లాన్ వస్తుంది. బాదుక్ గేమ్‌లోనే సల్-సూ లైఫ్‌ని ఎలా నాశనం చేయాలో కనిపెడతాడు. బయటకు వచ్చాక ఒక్కొక్కరిని రిక్రూట్ చేసుకుంటాడు. ఒక బ్లైండ్ బాదుక్ మాస్టర్, ఒక హ్యాకర్, ఒక గ్యాంగ్‌స్టర్, ఒక క్యూట్ అమ్మాయి… వీళ్లందరినీ ఒక టీమ్‌గా మార్చి సల్-సూ గ్యాంగ్ మీద దాడి చేస్తాడు. ఒక పక్క బాదుక్ బోర్డు అడుతుంటే, మరోవైపు రియల్ లైఫ్‌లో గ్యాంగ్‌స్టర్స్ ఒకరినొకరు చంపుకుంటారు. ఫైనల్ మ్యాచ్‌లో హా-సూ, సల్-సూ ఫేస్ టు ఫేస్ గేమ్ మొదలు పెడతారు. ఇక్కడ ఇప్పుడు గెలిచేవాడు కింగ్ అవుతాడు. ఓడిపోయేవాడు అన్నీ పోగొట్టుకుంటాడు. చివరికి ఈ గేమ్ ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడిపోతారు ? హా-సూ తన రివేంజ్ తీర్చుకుంటాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ కొరియన్ యాక్షన్ సినిమాని చూడాల్సిందే.

 

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×