E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి మెడలో తాళి కట్టిన అమర్  

Nindu Noorella Saavasam Serial Today February 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి మెడలో తాళి కట్టిన అమర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

మార్కెట్‌ నుంచి ఇంటికి వచ్చిన మనోహరి దగ్గరకు చంభా వెళ్లి మనోహరి తాళి కొన్నావా..? ఏది చూపించు అని అడుగుతుంది. ఇదిగో చూడు అంటూ మనోహరి కొన్న తాళి తీసి చంభాకు ఇస్తుంది. తాళి చూసిన చంభా అబ్బా ఎంత బాగుందో తాళి అంటుంది దీంతో తాళి బాగానే ఉంది కానీ రాథోడ్‌ బిహేవియరే బాగాలేదు అంటుంది. దీంతో చంభా వాడేం చేశాడు అని అడుగుతుంది. దీంతో మనోహరి మధ్యాహ్నం నుంచి తెగ ఓవర్‌ చేస్తున్నాడు. నాప్లాన్‌ తెలుసుకోవాలని చూస్తున్నాడు అని చెప్పగానే.. చంభా కూడా నాకు టెన్షన్‌ గా ఉంది మనోహరి అంటుంది. దీంతో మనోహరి నీకెందుకు టెన్షన్‌ అని అడగ్గానే.. ఆత్రం ఆపుకోలేకపోతున్నాను.. నువ్వు అమరేంద్రతో తాళి ఎలా కట్టించుకోబోతున్నావో చెప్పవా..? అని అడగ్గానే..

రేపు నువ్వే చూస్తావు కదా అని మనోహరి చెప్పగానే.. ఆత్రుతగా ఉంది మనోహరి చెప్పు అని చంభా అడగ్గానే.. ఎవరికీ చెప్పవు కదా..? అని మనోహర అడగ్గానే.. నేను నీ మనిషిని కదా మనోహరి నా మీదే అనుమానమా..?  ఎవ్వరికీ చెప్పనులే అంటుంది. దీంతో మనోహరి అయితే విను సరుకులకు నేను వెళ్లి వస్తూ.. ఒక కిల్లర్‌ను కలిశాను. రేపు హోమం జరిగేటప్పుడు దూరం నుంచి గన్‌తో నన్ను షూట్‌ చేయమని చెప్పాను అనగానే.. భయంగా చంభా అదేంటి రేపు జరిగేది నీ పెళ్లి కాదా..? నీ చావా..? అని అడగ్గానే.. రేపు గుడిలో అమర్‌ పిల్లలను కూర్చోబెట్టుకుని హోమం చేస్తుంటాడు. దూరం నుంచి కిల్లర్‌ అమరేంద్రను ఎయిమ్‌ చేస్తాడు. అదేంటి కిల్లర్‌ నిన్ను షూట్‌ చేస్తాడని చెప్పావు.. అని చంభా అడగ్గానే.. అబ్బా మధ్యలో అడ్డుపడకు.. అమర్‌ను షూట్‌ చేయబోతున్న కిల్లర్‌ను రాథోడ్‌ చూస్తాడు. సార్‌ మిమ్మల్ని ఎవరో షూట్‌ చేయబోతున్నారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే కిల్లర్‌ డమ్మి బుల్లెట్‌ వాడతాడు. నేను అమర్‌కు అడ్డు పడతాను. అని చెప్పగానే..

Advertisement

చంభా అనుమానంగా డమ్మీ బుల్లెట్‌ వాడితే బ్లడ్‌ రాదు కదా అని అడగ్గానే.. అయ్యో ఆ బుల్లెట్‌ వల్ల బ్లడ్‌ రాదు ఆల్‌రెడీ నా దగ్గర రెడీగా పెట్టుకున్న బ్లడ్‌ క్యూబ్‌ వల్ల బ్లడ్‌ వస్తుంది. అందరూ బాధగా ఏడుస్తుంటారు.. అమర్‌ ఎవరు షూట్‌ చేసింది.. అని అడుగుతాడు. నేను అది రణవీర్‌ వైఫ్‌ అనుకుంటా అని చెప్తాను.. అనగానే.. ఆ రణవీర్‌ వైఫ్‌ నువ్వే కదా అంటుంది చంభా.. ఆ విషయం అమర్‌కు తెలియదు కదా..? తనను కాపాడటం కోసం నేను బలయ్యాను అనుకుంటాడు. మనోహరి నన్ను కాపాడటం కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావా..? అని అడుగుతాడు. నేను అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు అమర్‌ అంటాను.. ఆ మాటకు అమర్‌ ఫీల్‌ అవుతాడు. మనోహరి అంటూ ఏడుస్తాడు.. ఆంటీ అంటూ పిల్లలు కూడా ఏడుస్తారు.. అప్పుడు నేను నా కోసం మీరు ఏడవకండి.. సంతోషంగా సాగనంపండి అంటాను.. అప్పుడు నువ్వొక మాట అంటావు.. అని చెప్పగానే..

నువ్వు చచ్చాక కాల్చాలా..? పూడ్చాలా..? అనా..? అంటూ చంభా చెప్పగానే.. కాదు నన్ను సుమంగళిగా పంపాలి అని చెప్తావు.. అని మనోహరి చెప్పగానే.. నువ్వు సుమంగళివే కదా అంటుంది చంభా.. మనోహరి కోపంగా చంభా అనగానే.. అర్థం అయింది.. సార్‌ మనోహరి మేడం మీకోసం మీ పిల్లల కోసం జీవితాన్నే దారపోసింది సార్‌ మీ కోసం తను పెళ్లి కూడా చేసుకోలేదు.. తన ఆఖరి కోరిక తీర్చండి సార్‌ మనోహరి మేడం మెడలో తాళి కట్టి నిండు ముత్తైదువువగా నిత్య సుమంగళిగా సాగనంపండి సార్‌ అని చెప్తాను.. అనగానే.. తాళి కట్టడానికి అమర్‌ ఆలోచిస్తాడు. పంతులు నువ్వు ఫోర్స్‌ చేస్తారు.. అని మనోహరి చెప్పగానే.. పంతులు మంగళసూత్రం తీసి అమర్‌కు ఇవ్వగానే..  పిల్లలు కూడా డాడ్‌ తాళి కట్టండి డాడ్‌ అంటారు. అప్పుడు అమర్‌ నా మెడలో తాళి కడతాడు అంటూ ఆనందంతో ఊహల్లో తేలిపోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×