GHMC: స్వేచ్చ బ్యూరో: జీహెచ్ఎంసీలోని పాలక మండలి అధికార గడువు ముగిసిన మంగళవారం చివరి రోజు అయినా భారీ మొత్తం నిధులతో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. కాప్రా సర్కిల్లో రూ. 51 కోట్ల నిధులతో అభివృద్ధి పనులతో పాటు గెలీలియో ప్రాంతంలో రూ.22 కోట్లతో ఫుట్ బాల్ కోర్టు, నాచారం బండ బావిలో రూ.9 కోట్లు, ఈసీఐఎల్ సర్కిల్లో రూ. 19 కోట్ల 36 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు, మహేందర్ రెడ్డి, శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బి. లక్ష్మారెడ్డి, కార్పోరేటర్ స్వర్ణ రాజ్ లతో కలిసి శంకుస్థాపనలు చేశారు. హస్తినాపురం డివిజన్ లో రూ. 5 కోట్ల 95 లక్షల నిధులతో నిర్మించ తలపెట్టిన ఎల్బీనగర్ సర్కిల్, వార్డు కార్యాలయ భవన సముదాయాల నిర్మాణం పనులను కూడా ప్రారంభించారు. వనస్థలిపురంలోని నాగార్జున కాలనీలో, శ్రీనివాసపురం కాలనీలో పైప్లైన్ల నిర్మాణానికి రూ. 2 కోట్ల 76 లక్షలు, రూ. కోటి 87 లక్షల నిధులతో వనస్థలిపురం లోని సుష్మ థియేటర్ నుండి రైతు బజార్, గురువార్ రోడ్డు వార్డ్ నెంబర్ 15 లో బీటీ రోడ్డు నిర్మాణం పనులు, రూ. 62 లక్షలతో పోలీస్ స్టేషన్ కు ముందున్న ఎంఐజీ కాలనీలో బీటీ రోడ్ల నిర్మాణం పనులు, రూ.39.50 క్రిస్టియన్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణాలు, రూ.19.50 లక్షలు నిధులతో గణేష్ టెంపుల్ వార్డ్ నెంబర్ 15లో సీసీ రోడ్లు, రూ.19.80 లక్షల నిధులతో వనస్థలి హిల్స్ కాలనీలో నిర్మాణాలను అమాత్యులు ప్రారంభించారు.
చాదర్ ఘాట్ లో ఇటీవలే ఆధునీకరించిన విక్టోరియా ప్లే గ్రౌండ్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందరంగా ఆమె మాట్లాడుతూ పునరుద్ధరించిన విక్టోరియా ప్లే గ్రౌండ్ లో ఉన్న బాస్కెట్ బాల్ నెట్, క్రికెట్ నెట్ స్థానిక క్రీడాకారులకు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మేయర్ విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులుగా రాణించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rowdy Janardhan: విజయ్ రౌడీ జనార్ధన్ లో స్టార్ హీరో.. ఇది అసలు ఊహించలేదుగా?
పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణలో హైడ్రా చొరవను ఆయన అభినందించారు. ముఖ్యంగా నగరంలో చెరువుల అభివృద్ధికి హైడ్రా ఎంతో కృషి చేస్తోందని, చెరువుతో పాటు ఆ పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. వరద నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్యానికి, భూగర్భ జలాల పరిరక్షణకు చెరువుల ప్రాధాన్యతను గుర్తించే వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఉప్పల్‌లోని ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవానికి మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువును ఎలా అభివృద్ధి చేస్తున్నారు? ఏలా తీర్చిదిద్దుతున్నారు? అనే విషయాలను అక్కడ చెరువు పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థ యజమాని మహమ్మద్ యూనస్‌ను అడిగి తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధి పనులకు సంబంధించిన 3డీ నమూనాలను మంత్రి పరిశీలించారు.
ఉప్పల్ నల్లచెరువు ఫ్రంట్ ఎలివేషన్ బాగుండాలని మంత్రి శ్రీధర్‌బాబు పనులను పర్యవేక్షిస్తున్న సంస్థకు సూచించారు. వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఈ చెరువుంది, దాదాపు కిలోమీటరు పొడవునా చెరువు విస్తరించి ఉంది. రోడ్డు పొడవునా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. చెరువు చుట్టూ 2 కిలోమీటర్లకు పైగా వాకింగ్ ట్రాక్ వస్తుందని, చిన్న పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, చెరువు చుట్టూ సీటింగ్ సౌకర్యం, పచ్చిక బైయళ్లు, పార్కులు, అన్ని వయసుల వారికి వ్యాయాయ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయని, అక్కడ పనులు చేపడుతున్నవారు మంత్రికి తెలిపారు. మురుగు నీరు కలవకుండా డైవర్ట్ కాలువలు నిర్మిస్తున్నామని వివరించారు. ఆక్రమణలతో 55 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును 69 ఎకరాలకు విస్తరించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే పలుసార్లు ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించారని తెలిపారు. ఆక్రమణల తొలగింపు విషయంలో హైడ్రా అధికారుల చొరవ చెరువు విస్తరణకు దోహదపడిందని తెలిపారు. చెరువులో 3 మీటర్ల మేర పూడికను తొలగించామని, ప్రధాన ద్వారం చెరువుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
Also Read: Illu Illaalu Pillalu : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కు శుభం కార్డు.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..