E-Paper
Advertisement

Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

Rahul Gandhi: రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపాటు
Advertisement

Rahul Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిణామాలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్‌గాంధీ. ఓట్ల చోరీ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఎన్నికల అవకతవకలు బీజేపీకి సీట్లు గెలవడానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి సహాయ పడ్డాయని ఆరోపించారు.

రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు.. తెరపైకి ఓట్ల చోర్

Advertisement

ఓట్ల దొంగతనం కొన్నిసార్లు సీట్లు, మరికొన్నిసార్లు ప్రభుత్వాలనే దొంగలిస్తుందని మండిపడ్డారు. లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీల్లో సుమారుగా ఆరుగురిలో ఒకరు ఓట్ల దొంగతనం ద్వారా గెలిచారని కుండబద్దలు కొట్టేశారు. వారిని గుర్తించడం కష్టమేమీ కాదని, బీజేపీ పరిభాషలో వారిని చొరబాటుదారులు అని పిలవాలా? అని ప్రశ్నించారు.

హర్యానా విషయానికొస్తే? అక్కడ ప్రభుత్వమే చొరబాటుదారుల ప్రభుత్వమని ఆరోపించారు. సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకునేవారు ఓటర్ల జాబితాలను, ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసేవారు వారే స్వయంగా రిమోట్ కంట్రోల్‌లో ఉంటారని అన్నారు. వారి అసలు భయం సత్యమేనని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే ఇవాళ 140 సీట్లు కూడా ఆ పార్టీ గెలుచుకునేది కాదన్నారు.

Advertisement

 బీజేపీపై తీవ్రస్థాయిలో రాహుల్ మండిపాటు

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ భారీ మెజారిటీలతో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వెల్లడైన రెండు రోజుల తర్వాత ప్రతిపక్షాలు ఎన్నికల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న గుప్పించడంపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకుంటున్న సంస్థలు కేంద్రం నియంత్రణలో ఉన్నాయని ఆయన ప్రధాన ఆరోపణ.

సోమవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ అస్సాం, బెంగాల్ ల్లో ఎన్నికలు దొంగిలించబడ్డాయనడానికి స్పష్టమైన ఉదాహరణలని ప్రధానంగా విమర్శించారు. బెంగాల్ మాజీ సీఎం మమత మాటలతో ఏకీభవిస్తున్నామని అన్నారు. బెంగాల్‌లో 100కు పైగా సీట్లను బీజేపీ దొంగిలించారని మమత మంగళవారం ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఇలాంటి పోకడలే కనిపించాయంటూ  కాంగ్రెస్ నేతలు మాటల వేడి పెంచారు.
ALSO READ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి కొత్త టెన్షన్.. కాంగ్రెస్ వైపు మైనార్టీల మొగ్గు, అస్సాం టు తమిళనాడు

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×