E-Paper
Advertisement

Star Heroines: ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్.. హీరోయిన్లదే హవా..!

Star Heroines: ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్.. హీరోయిన్లదే హవా..!
Advertisement

Star Heroines:  బాలీవుడ్..సౌత్ సినిమా ఇండస్ట్రీల భవిష్యత్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు వయసు పెరుగుతున్న సమయంలో.. తర్వాత వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్న ప్రశ్న అభిమానుల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆల్రెడీ స్టార్ తెచ్చుకున్న హీరోలే తప్ప కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు పెట్టగా నిలదొక్కుకోవడం లేదు. మరో పక్కన.. కొత్త తరం నటీమణులు మాత్రం చాలా బలంగా ముందుకు వస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రేక్షకులు ఇప్పుడు కథ, నటన, పాత్రకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ మార్పు సమయంలో హీరోయిన్స్ ఇండస్ట్రీలో ముందుండి నడిపిస్తున్నారని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలకు తగ్గట్టు ఈమధ్య రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా కలెక్ట్ చేసింది అన్న సంగతి తెలిసిందే. కొత్త తరం హీరోయిన్లు తమ ప్రతిభతో.. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. అందుకే భవిష్యత్‌ను మహిళలే లీడ్ చేస్తారా అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది.

Advertisement

ఈ కొత్త తరం నటీమణుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు త్రిప్తి డిమ్రీ. ఆమె కాలా, బుల్బుల్, లైలా మజ్ను వంటి సినిమాల్లో తన సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన ధడక్ 2లో కూడా ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. ఆమె కళ్లలో కనిపించే భావాలు..పాత్రలో పూర్తిగా లీనమయ్యే తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఆమెను భవిష్యత్ స్టార్‌గా చాలామంది చూస్తున్నారు.

కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో పేరు అనీత్ పడ్దా. సయ్యారా సినిమాలో వాణి పాత్రలో ఆమె నటనకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. కొత్త నటీమణిగా ఆమె చూపించిన నటన చాలా బలంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఒక్క సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు రావడం విశేషం.

Advertisement

సౌత్ ఇండస్ట్రీలో కళ్యాణి ప్రియదర్శన్ కూడా తనదైన ముద్ర వేస్తోంది. ఆమె నటించిన లోకా సినిమా మంచి విజయం సాధించింది. మహిళా ప్రధాన పాత్రతో వచ్చిన సూపర్ హీరో సినిమా కావడం ప్రత్యేకత. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఇటీవల ఎక్కువగా చర్చలో ఉన్న మరో పేరు రుక్మిణి వసంత్. కాంతార: చాప్టర్ 1లో ఆమె కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె తెరపై ఉన్న సహజమైన ఆకర్షణ, నటన భవిష్యత్‌లో ఆమెకు పెద్ద అవకాశాలు తెచ్చిపెట్టవచ్చని భావిస్తున్నారు.

ఇలా హీరోలు మాత్రం పెద్దగా రాకుండా కనుమరుగుతున్న సమయంలో హీరోయిన్ మాత్రం దూసుకుపోతున్నారు. కొత్త తరం నటీమణులు ఇప్పటికే ఇండస్ట్రీని ముందుకు నడిపించే స్థాయికి చేరుకుంటున్నారు. ఇప్పుడు అభిమానుల్లో ఉన్న ప్రధాన ప్రశ్న ఒక్కటే. ఈ మారుతున్న కాలంలో.. కొత్త తరం మగ నటుల్లో ఎవరు ముందుకు వచ్చి స్టార్‌గా నిలుస్తారు? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పూర్తిగా మార్పు దశలో ఉందని చెప్పొచ్చు.

ALSO READ: Allu Arjun: జపాన్ లో అడుగుపెట్టిన పుష్పరాజ్..ఇక రప్పా రప్పానే!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×