E-Paper
Advertisement

Kawasaki Bikes Offers Jan 2026: కవాసకి క్రేజీ ఆఫర్లు, ఆ బైక్స్ మీద ఏకంగా రూ. 2.5 లక్షల తగ్గింపు!

Kawasaki Bikes Offers Jan 2026: కవాసకి క్రేజీ ఆఫర్లు, ఆ బైక్స్ మీద ఏకంగా రూ. 2.5 లక్షల తగ్గింపు!
Advertisement

కవాసకి కొత్త సంవత్సరంలో కొత్త ఆఫర్లు ప్రకటించింది తన బైక్‌లపై జనవరి 31 వరకు చెల్లుబాటు అయ్యే కొత్త డిస్కౌంట్లను తీసుకొచ్చింది. కవాసకి నింజా, వెర్సిస్, Z శ్రేణికి చెందిన బైక్‌లపై ఈ తగ్గింపు లభిస్తోంది. కవాసకిల తాజా ధరలు ఎలా ఉన్నాయి? ఏ బైక్స్ మీద ఎంత తగ్గింపు అందిస్తుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ కవాసకి నింజా రేంజ్

కవాసకి నింజా ZX-10Rపై రూ. 2,50,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ ఇప్పుడు రూ. 18,29,000కు అందుబాటులో ఉంది. ఇది దాని విభాగంలో అత్యంత సామర్థ్యం గల 1 లీటర్ క్లాస్ బైక్‌లలో ఒకటి.  కవాసకి నింజా 1100SX అనేది బ్రాండ్   ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ టూరర్. దీనిని రూ. 1,43,000 తగ్గింపుతో అందిస్తున్నారు. దీని ధర ఇప్పుడు రూ. 12,99,000గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ డౌన్‌ పేమెంట్ స్కీమ్, తక్షణ లోన్ అప్రూవల్ ఆఫర్ కూడా ఉంది. కవాసకి నింజా ZX-6R భారత్ లో ఉన్న ఏకైక జపనీస్ ఇన్‌ లైన్ ఫోర్ 600cc సూపర్‌ బైక్. ఇది రూ. 83,000 విలువైన ఫ్రీ స్టీరింగ్ డంపర్‌తో వస్తుంది. కవాసకి నింజా 650, కవాసకి నింజా 500, కవాసకి నింజా 300 వరుసగా రూ. 27,000, రూ. 17,000,  రూ. 28,000 క్యాష్ ఆఫర్ ను పొందుతున్నాయి. నింజా 650 ధర రూ. 7,64,000, నింజా 500 ధర రూ. 5,49,000, మరియు నింజా 300 ధర రూ. 2,89,000కు లభిస్తున్నాయి.

Advertisement

Read Also: మారుతి కార్లపై రూ.1.3 లక్షల తగ్గింపు, ఎప్పటి వరకు అంటే?

⦿ కవాసకి వెర్సిస్ రేంజ్

కవాసకి వెర్సిస్ శ్రేణిపై ఆఫర్లను అందిస్తుంది. దాని అడ్వెంచర్ టూరర్లు అయిన కవాసకి వెర్సిస్ 1100, కవాసకి వెర్సిస్-X 300 ఉన్నాయి.  వెర్సిస్ 1100 రూ. 1,00,000 క్యాష్ ఆఫర్ ను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు రూ. 12,89,000 అందుబాటులో ఉంది. వెర్సిస్-X 300 ఫ్రీ యాక్సెసరీస్ తో వస్తుంది.  అలాగే రూ. 20,000 అదనపు నగదు క్యాష్ డిస్కౌంట్ ను పొందుతారు. 2025 మోడల్ కవాసకి వెర్సిస్-X 300 కొనుగోలు చేస్తే,  ఎటువంటి ఫ్రీ యాక్సెసరీస్ లభించవు. కానీ, రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది.

Advertisement

Read Also: హ్యుందాయ్ జనవరి డిస్కౌంట్లు.. ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు!

⦿ కవాసకి Z శ్రేణి

కవాసకి Z650పై రూ. 27,000 తగ్గింపు అందిస్తుంది. దాని రెట్రో స్టైల్ సిస్టర్ అయిన  కవాసకి Z650RS పై రూ. 20,000 నగదు తగ్గింపును పొందుతుంది. కవాసకి Z650 ధర ఇప్పుడు రూ. 6,99,000 కాగా, కవాసకి Z650RS ధర 7,63,000గా ఉంది. కవాసకి ఇటీవల 2026 కోసం తన బైక్స్ ను అప్ డేట్ చేసింది. ఈ ఆఫర్లు కేవలం స్టాక్ క్లియరెన్స్ వ్యూహంలో భాగంగా తీసుకొచ్చింది. మీరు కూడా కవాసకిని కొనాలనుకుంటే, ఇప్పుడే త్వరపడటం మంచిది. తక్కువ ధరలో నచ్చిన బైక్ కొనుగోలు చెయ్యొచ్చు.

Read Also:  ట్రక్కుతో టాటా పంచ్ క్రాష్ టెస్ట్.. సీన్ కట్ చేస్తే రిజల్ట్ ఏంటో తెలుసా?

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×