UP Crime: ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ ఆవరణంలో అందరూ చూస్తుండగానే భార్యని కాల్చి చంపాడు ఆమె భర్త. ఈ ఘటనలో నిందితుడ్ని అరెస్టు చేయడమేకాదు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు. అసలేం జరిగింది?
యూపీలోని పోలీసుస్టేషన్ ఆవరణంలో దారుణం
యూపీలోని హర్దోయిలో పోలీస్‌స్టేషన్‌లో ఊహించని ఘటన జరిగింది. రామ్‌పూర్ అతారియా వాసి అనూప్-సోనీ దంపతులు. చిన్నవయస్సులో వీరికి వివాహం జరిగింది. జంటకు పిల్లలు కూడా ఉన్నారు. వీరి జీవితంలోకి ఓ వ్యక్తి ఎంటరయ్యాడు. జనవరి 7న ప్రియుడు షాజహాన్‌పూర్ నివాసి సుర్జిత్‌తో కలిసి సోని వెళ్లిపోయింది. అంతేకాదు నగలతోపాటు 35 వేల రూపాయలు పట్టుకెళ్లింది.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనూప్. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఎట్టకేలకు సోనీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్‌లో ఉంచారు. సోమవారం స్టేషన్‌కు రావాలని అనూప్‌ను పిలిపించారు పోలీసులు. ఆమెని కోర్టులో హాజరుపరిచే మిగతా పనులు వేగంగా జరుగుతున్నాయి.
అందరూ చూస్తుండగా భార్యని కాల్చిన భర్త
స్టేషన్ ఆవరణలో క్యాంటిన్‌కి సోనీని ఓ మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్తోది. స్టేషన్ లోపల నుంచి బయటకు వచ్చిన అనూప్, భార్య సోదరి, మామతో మాట్లాడుతున్నాడు. ఈలోగా భార్యని చూసి తనతో తెచ్చుకున్న గన్‌తో సోనీపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వెంటనే ఆమెని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సోని ఈలోకాన్ని విడిచిపెట్టింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన అనూప్‌ని పోలీసులు రౌండప్ చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించినందుకు ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ALSO READ: వేధింపులు తట్టుకోలేక.. ఇంటికి వచ్చిన టీచర్ సూసైడ్
సోనీని తీసుకెళ్లిన వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. ఆ మహిళ రక్షణలో ఉన్న మహిళపై ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ సంఘటన జరగడంతో ఆగ్రహావేశాలు రేగాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.