E-Paper
Advertisement

Suhas: ఇతనెందుకు సెట్‌లో ఉన్నాడని హేళన చేశారు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్‌తో?

Suhas: ఇతనెందుకు సెట్‌లో ఉన్నాడని హేళన చేశారు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్‌తో?
Advertisement

Suhas: సుహాస్, శివానీ నగరం హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హే బల్వంత్’ (‘హే భగవాన్’ టైటిల్‌ని మార్చారు). ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటి తమ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ‘నాట్ ఏ టైటిల్ ఈవెంట్’ పేరుతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సుహాస్ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

Also Read- Peddi Movie: మెగాఫాన్స్ కి ఊహించని షాక్.. పెద్ది ఇప్పట్లో లేనట్టే?  మళ్లీ వాయిదా..

ఎక్కడా రాజీపడలేదు

Advertisement

‘‘నాకు మొదటి నుంచి సపోర్ట్ ఇస్తున్న హీరోలలో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ఒకరు. ఆయన ఈ వేడుకకు వచ్చినందుకు కృతజ్క్షతలు తెలియజేస్తున్నాను. టీమ్‌ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. నా తోటి ఆర్టిస్టులందరూ ఈ సినిమా కోసం ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశారు. వివేక్‌ సాగర్‌ అందించిన మ్యూజిక్.. మ్యూజికల్‌ నైట్‌లా ఉంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు. సినిమా షూటింగ్‌ అంతా ఎంతో పాజిటివ్‌ వాతావరణంలో జరిగింది. వంశీ నందిపాటి గురించి ఇంతకు ముందు విన్నాను. ఈ సినిమాతో ఆయనెంటో నాకు తెలిసింది. ఆయన మంచి ప్లానింగ్‌తో సినిమాపై బజ్‌ తీసుకొచ్చారు. దర్శకుడు గోపీ ఈ సినిమాతో తన డ్రీమ్‌ను‌ నెరవేర్చుకున్నాడు. ఎంతో కష్టపెట్టి ఓ మంచి సినిమా తీశాడు. శివానీ, సుదర్శన్‌లు ఇద్దరూ ఇందులో సూపర్‌గా యాక్ట్‌ చేశారు. ‘హే బల్వంత్’ (Hey Balwanth)తో నాకు పెద్ద హిట్‌ వస్తుందని నమ్ముతున్నాను.

Also Read- SSS Film Release: శివాజీ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని రిలీజ్ డేట్ ఫిక్స్..ఆ రోజే థియేటర్లలోకి..

నా దృష్టిలో సక్సెస్ అంటే అదే..

Advertisement

నా కెరీర్‌లో ‘మజిలీ’ సినిమాతో మంచి బ్రేక్‌ వచ్చింది. అప్పటి నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ సమయంలోనే పెద్ద హీరోయిన్‌తో చాలా దగ్గరగా ఉండేలా ఓ సినిమాలో ఆఫర్‌ వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అది. సినిమా సెట్‌కు వెళ్లినప్పుడు.. యూనిట్‌లోని ఓ పెద్దాయన.. ఇతనిని ఎందుకు సెట్‌లో పిలిచారు? అని హేళనగా మాట్లాడారు. కట్‌ చేస్తే.. కీర్తి సురేష్‌తో కలిసి ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా చేశాను. నేను గ్రేట్‌గా ఫీలయిన మూమెంట్‌ అది. సక్సెస్ అంటే ఇదేనేమో అని అనుకున్న సందర్భమది. సెట్ రెండో రోజే కీర్తి సురేష్ (Keerthy Suresh) నన్ను పిలిచి హగ్ ఇచ్చారు. ఇప్పటికీ ఆమె మాట్లాడుతూనే ఉంటారు. ఆమెకు మా ఇంటి వంటలు తినిపించేంత చనువు ఏర్పడింది. నా భార్య ఆమె కోసం ఎన్నో వంటలు చేసి పంపించేది. నేను, నా భార్య ఇద్దరం ఆమెకు అభిమానులం. ఆమెది చాలా గొప్ప మనసు. అందుకే చెబుతున్నాను.. ఎవరైనా మిమ్మలను తక్కువ చేసి మాట్లాడితే.. నవ్వి ఊరుకోండి.. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. మీకంటూ ఓ రోజు వస్తుంది’’ అని సుహాస్ (Suhas) ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

Also Read- Malavika Mohanan: క్రేజీ ఆఫర్ కొట్టేసిన ప్రభాస్ బ్యూటీ.. హీరో, డైరెక్టర్ ఎవరంటే?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×