Romanchakam Movie story:అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్.. యానిమల్ వంటి ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ ఈసారి ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు .
తన భద్రకాళి పిక్చర్స్ సినిమాపై సుమంత్ ప్రభాస్ హీరోగా అవంతిక సనిల్ కుమార్ హీరోయిన్ గా రొమాంటిక్ లవ్ స్టోరీ ని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు సిద్ధమైపోయాడు.
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న సినిమా థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమయింది .అయితే ఈ సినిమాని స్వయంగా సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూస్ చేస్తుండటంతో అసలు సందీప్ ని ఎంగేజ్ చేసిన ఆ కథ ఏమై ఉంటుందా అంటూ క్యూరియస్ గా సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం.
సినిమా కథ విషయానికి వస్తే అన్వేష్ అనే కుర్రోడు తన ఫ్రెండ్స్ తో అల్లరి చిల్లరగా తిరుగుతూ తన తండ్రితో అడ్డంగా తన్నులు తింటూ సరదాగా గడిపేస్తూ ఉంటాడు .అలా హీరో ఫ్రెండ్ గ్యాంగ్ తో మంచి కామెడీ ఎంటర్టైన్ సీన్స్ ని కూడా దట్టించాడంట డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి .
హీరో ఫ్రెండ్స్ చేసే అల్లరి వాళ్ళ చిల్లర వేషాలు వాళ్లు చేసే అనుకోని పనుల వల్ల బుక్కవడం వంటి ఎన్నో సీన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయని తెలుస్తుంది. ఇక హీరోతో తల్లి మాట్లాడుతూ ఎవరికో ఏదో నిరూపించుకోవాలని నిన్ను నువ్వు మోసం చేసుకోకు అని అనడం బట్టి చూస్తే తల్లి మాట ప్రకారం ఏదైనా బిజినెస్ పెట్టి తనని తానూ ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడట. ఈ క్రమంలో తనకొచ్చిన ఒక ఐడియాని అమలు పరచాలని ప్లాన్ వేస్తాడు.
అదేంటంటే డేటింగ్ యాప్ అనే స్టార్టప్ కంపెనీ.జెన్ జీ బ్యాచ్ అన్వేష్ పెట్టిన ఆ యాప్ ని విచ్చల విడిగా వాడటంతో దానికి డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దాంతో ఈ డేటింగ్ యాప్ సర్వీస్ ని మరింత ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా అసలు ఈ యాప్ ని ఎలా డెవలప్ చెయ్యాలా అంటూ రీసెర్చ్ చేసే క్రమంలో చెన్నైలో అడుగు పెడతాడట అన్వేష్ .సరిగ్గా అక్కడే హీరోయిన్ అవంతిక అన్వేష్ కి పరిచయం అవుతుందట.
ఇక తన డేటింగ్ యాప్ డెవలప్మెంట్ చేసే ప్రాసెస్ లో భాగంగా అవంతికతో అన్వేష్ కి మంచి కెమిస్ట్రీ కుదురుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ పెరిగి అది లవ్ కి దారితీస్తుంది అలా వాళ్ళిద్దరి మధ్యలో మంచి లవ్ ట్రాక్ సాగుతుండగానే, డేటింగ్ యాప్ కారణంగా అనుకోకుండా చిన్న అపార్ధాలు కాస్త పెద్ద గొడవలుగా మొదలైపోయి ఇద్దరు బ్రేకప్ అనుకునే పరిస్థితి వస్తుంది .
ఇక ఫ్రెండ్స్ చేసిన ఒక వెదవ పని వల్ల అన్వేష్ తో సహా అంతా జైల్లో పడతారు .ఇక జైల్లో అన్వేష్ నా ప్రేమకథ రాస్తే రాస్తే రామాయణం ..తీస్తే రోమాంచకం అనడం చూస్తుంటే లవ్ లో అన్వేష్ ఇంత డీప్ గా మునిగిపోయాడో అర్థం అవుతుంది .మొత్తానికి డేటింగ్ యాప్ స్టార్టప్ తో మొదలై,హీరో తన ఫ్రెండ్స్ తో కామెడీని పండిస్తూ చెన్నై అమ్మాయితో రొమాన్స్ చేస్తూ,బ్రేకప్ అయ్యి చివరికి ఎలా కలుస్తారు అంటూ మొత్తానికి ఒక ట్రెండీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ని డిజైన్ చేశాడని అర్థమవుతుంది .
చూడాలి.. సెప్టెంబర్ 3న థియేటర్లోకి రానున్న ఈ సినిమా సుమంత్ ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో. ఇక ఈ హీరో గతంలో చేసిన మేం ఫేమస్ అనిపించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన గోదారి గట్టున సినిమా సో సో గానే ఆడటంతో ,ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు సుమంత్ ప్రభాస్ .
also read:ఇరగదీస్తున్న ఇరుముడి …ఈసారి మరిన్ని రికార్డుల దిశగా !
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ రావడం సినిమాపై మంచి బజ్ పెంచేదే .. చూడాలి ఇంత బజ్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో!