E-Paper
Advertisement

ఆ కెపాసిటీ నాకు లేదు.. మల్టీ స్టారర్ నుండి తప్పుకోవడంపై డైరెక్టర్ క్లారిటీ!

ఆ కెపాసిటీ నాకు లేదు.. మల్టీ స్టారర్ నుండి తప్పుకోవడంపై డైరెక్టర్ క్లారిటీ!

Film industry:సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే దర్శకులు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎప్పుడూ కొంతమంది హీరోలతో సినిమా చేసేవారు సడన్గా పెద్ద హీరోలతో అవకాశం వస్తే అక్కడ హ్యాండిల్ చేస్తామా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది తమకు చేతకాకపోతే ధైర్యంగా ఒప్పుకొని ఆ సినిమాల నుంచి తప్పుకుంటూ ఉంటారు. అలా ఒక స్టార్ డైరెక్టర్ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయనకు సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం మళ్లీ లభిస్తే చేయకుండా సినిమా నుంచి తప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఇన్ని రోజుల తర్వాత అసలు అలా తప్పుకోవడం వెనుక అసలు కారణాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సి. సుందర్.

ఆ సామర్థ్యం నాకు లేదు – డైరెక్టర్ సుందర్

కమలహాసన్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం సుందర్ . సికి లభించింది. కానీ ఆయన గత ఏడాది నవంబర్లో ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. కట్ చేస్తే కొన్ని రోజులకే సదరు ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు కూడా.. మరి ఇన్నాళ్లకు ఈ విషయంపై స్పందిస్తూ ఎందుకు అలా బయటకు రావాల్సి వచ్చింది అనే విషయంపై స్పందించారు. ఈ విషయంపై డైరెక్టర్ సుందర్ సి మాట్లాడుతూ.. “కమలహాసన్, రజినీకాంత్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా అనౌన్స్ చేయగానే.. నన్ను డైరెక్టర్ గా చెప్పినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యాను. గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీస్తూ సినిమాలు చేస్తూ వచ్చాను. కానీ ఒక్కసారిగా రజినీ సినిమాను డీల్ చేసే అవకాశం రావడంతో ఒత్తిడికి లోనయ్యాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన సినిమాను డీల్ చేసే కెపాసిటీ నాకు లేదనిపించింది. ఈ ప్రాజెక్టు హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలను ఇతరులకు చెప్పి ఒప్పించే సామర్థ్యం నాకు లేదనిపించింది. పైగా నాకు స్టోరీ సరిగ్గా చెప్పడం రాదు.. అదే టైంలో ఎవరైనా మార్పులు చెబితే ఎదురు తిరగకుండా ఓకే చెప్పేస్తాను.

ఎప్పటి నుంచో ఆ కోరిక ఉన్నా.. నెరవేర్చుకోలేకపోయాను- డైరెక్టర్

ఇక ఇలాంటి పెద్ద సినిమా చేస్తే అందులో నా ఒక్కడిదే నిర్ణయం ఉండదు కదా.. సినిమాకు, ఆ ఇద్దరు లెజెండ్స్ కి నేను పూర్తిగా న్యాయం చేయలేను అనిపించింది. అందుకే మొదట్లోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాను. నిజానికి కమలహాసన్, రజనీకాంత్ తో కలిసి పని చేయాలని నాకు ఎప్పటినుంచో ఉన్నా.. ఆ ఆలోచనను నేను మానుకోవాల్సి వచ్చింది . ముఖ్యంగా ఇలా చేయడానికి ముందే స్వయంగా నేను రజనీకాంత్ ని కలిసి విషయం చెప్పాను.. ఆయన ఒప్పుకున్నాకే సినిమా నుండి కప్పుకున్నాను” అంటూ సుందర్ క్లారిటీ ఇచ్చారు.

also read:ఆ 6 నెలలు నా కలల్ని నాశనం చేశాయి – ఆర్. మాధవన్

అభిమానుల రియాక్షన్..

ఇకపోతే గతంలో రజినీకాంత్ తో అరుణాచలం, కమలహాసన్ తో సత్యం శివ సినిమాలు చేసిన సుందర్ సి ఆ తర్వాత కాలంలో హారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇప్పుడు మళ్లీ చేసే అవకాశం లభించినప్పటికీ హ్యాండిల్ చేయలేనని తప్పుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి దీనిపై అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×