E-Paper
Advertisement

లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ

లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ
Advertisement

Inspirational Sports Drama: సొసైటీలో చాలామంది అవతల వాళ్ళ టాలెంట్ చూడకుండా, కేవలం వాళ్ళ బాడీ షేప్, వెయిట్ చూసి జడ్జ్ చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఈ బాడీ షేమింగ్ ప్రాబ్లమ్ మరీ ఎక్కువ. కానీ ఎవరైతే లావుగా ఉన్నావని ఎగతాళి చేస్తారో వాళ్ళకు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన అమ్మాయి కథే ఈరోజు మన మూవీ సజెషన్. అదే శరీరంతో గ్రేట్ అచీవ్‌మెంట్ సాధించి దేశం గర్వపడేలా చేసిన ఒక రియల్ గర్ల్ స్టోరీనే ఈ ‘సుమో దీదీ’ (Sumo Didi). ఇండియా ఫస్ట్ ప్రొఫెషనల్ ఉమెన్ సుమో రెజ్లర్ హేతల్ డేవ్ రియల్ లైఫ్ బేస్డ్ గా తెరకెక్కిన ఈ బయోపిక్, ప్రతీ ఒక్కరికి డీప్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. మరి ఈ ఇన్స్పిరేషనల్ సినిమా స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హేతల్ డేవ్‌ కు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ప్యాషన్. కానీ ఆమె ఎంచుకున్న ఫీల్డ్ మాత్రం చాలా రేర్ అండ్ డిఫరెంట్. ఇండియాలో సుమో రెజ్లింగ్ గురించి అసలు ఎవరికి తెలుసు ? అలాంటిది ఒక ఇండియన్ గర్ల్ సుమో ప్లేయర్‌ గా మారడం అంటే మామూలు సాహసం కాదు. హెతల్ బరువును చూసి కాలేజీలో, చుట్టు పక్కల వాళ్ళు చేసే కామెంట్స్ ఆమెను చాలాసార్లు డిప్రెషన్‌ లోకి నెట్టేస్తాయి. అయినా సరే ఆమె వాటిని నెగెటివ్‌ గా తీసుకోకుండా తన స్ట్రెంగ్త్‌ గా మార్చుకుంటుంది.

Advertisement

జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్ నుంచి సుమో వైపు షిఫ్ట్ అయిన ఆమె, ఇంటర్నేషనల్ లెవెల్‌ లో ఇండియా తరపున మెరవాలని ఫిక్స్ అవుతుంది. అయితే ఈ జర్నీ ఆమెకు అసలు ఈజీగా ఉండదు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇండియాలో ప్రాపర్ ట్రైనింగ్ సెంటర్స్ లేకపోవడం వంటి ఎన్నో అడ్డంకులను ఆమె ఎదుర్కొంటుంది. ఎస్టోనియాలో జరిగే వరల్డ్ సుమో ఛాంపియన్‌ షిప్‌ కు సెలెక్ట్ కావడానికి ఆమె పడే కష్టం, ఆఖరికి గ్లోబల్ స్టేజ్ మీద టాప్ రెజ్లర్స్‌ తో పోటీ పడే సీన్స్ ఆడియన్స్‌ కు గూస్‌ బంప్స్ తెప్పిస్తాయి. విమర్శలను బ్లెస్సింగ్‌ గా మార్చుకుని సక్సెస్ సాధించిన తీరు ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. ఈ వీకెండ్ కు ఫ్యామిలీతో కలిసి ఓ మంచి సినిమా చూడాలి అనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ?

‘సుమో దీదీ’ మూవీ జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రశతుత్తం హిందీ లాంగ్వేజ్‌ లో అందుబాటులో ఉంది. తెలుగులో ఆడియో లేదు. బట్ స్పోర్ట్స్ బయోపిక్స్ లవర్స్ దీన్ని మిస్ కాకూడదు. శ్రియం భగ్నాని లీడ్ రోల్‌ లో అద్భుతంగా నటించగా, జయంత్ రోహత్గి డైరెక్షన్ ఈ స్పోర్ట్స్ డ్రామాను చాలా ఎమోషనల్‌ గా ప్రెసెంట్ చేసింది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారు.

Advertisement

Read Also: ఒక వైపు ట్రోలింగ్.. మరోవైపు రికార్డులు ఓటీటీలో ‘ది ప్యారడైజ్’ సంచలనం!

Tags

Related News

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

గాయపడిన అమ్మాయిని కాపాడి దేశాన్ని కుదిపేసే కుట్రలో బలయ్యే పోలీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్‌

అబ్బాయిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ మూవీని మిస్ అవ్వకూడదు… కొత్త మలయాళం సినిమా గురూ

కూతురు ప్రేమలో పడితే తండ్రికి టెన్షన్‌… ఆమె లవ్‌ లైఫ్‌ పాడు చేయడానికి సీక్రెట్‌ ప్లాన్లు… భలే కామెడీ భయ్యా

పారిపోయిన హీరోపై హత్యా నేరం… చనిపోయాడనుకున్న వాడు తిరిగొస్తే… శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రివేంజ్

జైల్లో ఉన్నా దొంగతనాలు ఆగవు… లూపిన్‌ కొత్త గేమ్‌ చూస్తే మైండ్‌ బ్లాక్‌

ఇప్పటికే 6 సీజన్లు… 30కి పైగా ఎపిసోడ్లు… ఓటీటీని ఊపేస్తున్న హనుమాన్ కొత్త సీజన్ వచ్చేసిందోచ్

Big Stories

Advertisement
×