E-Paper
Advertisement

నానా పటేకర్ చనిపోలేదా.. హాట్ బాంబు పేల్చిన నటి!

నానా పటేకర్ చనిపోలేదా.. హాట్ బాంబు పేల్చిన నటి!
Advertisement

Tanu Shree Dutta: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న నానా పటేకర్ (Nana Patekar) 75 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న గోవాలోని తన నివాసంలో ఉన్నట్టుండి గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. అయితే అదే రోజు రాత్రి పూణేలోని డోన్జే ఏరియాలో ఉన్న ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంచనాలతో నానాపటేకర్ అంత్యక్రియలు పూర్తయినట్లు సమాచారం. ఆయన మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేశారు.

నానా పటేకర్ చనిపోలేదు.. తనూ శ్రీ దత్త..

ఒకవైపు ఆయన మరణానికి యావత్ దేశ అభిమానులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తుంటే.. ‘ఈవిల్ డెడ్’ అనే ఒక పదంతో సంచలనం సృష్టించింది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ తనూ శ్రీ దత్త (Tanu Shree Dutta). మీ టు ఉద్యమంలో లైంగిక ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన ఈమె.. నానాపటేకర్ కారణంగా 18 సంవత్సరాల పాటు నరకం అనుభవించానని.. అతడికి నరకంలో కూడా మనశ్శాంతి ఉండకూడదని, తాను భూమి మీద బ్రతికున్నంత వరకు నరకంలో హింసకు గురవ్వాలి అంటూ సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె నానా పటేల్ చనిపోలేదు.. మలేషియాలో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ హాట్ బాంబు పేల్చింది.

నానాపటేకర్ శవాన్ని ఎందుకు ఎవరూ చూడలేదు?

Advertisement

తనూ శ్రీ దత్త తన అనుమానాలను ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కానీ , కనీసం మీడియా నుంచి కానీ ఎవరూ కూడా నానా పటేకర్ శవాన్ని చూడలేదు. అంత తొందరగా ఆయన అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా అర్ధరాత్రి దాటాక.. హుటాహుటిన అంత్యక్రియలు చేశారు. అంత పెద్ద లెజెండ్.. అంత గొప్ప మనిషి.. ఆఖరి చూపు కోసం బాలీవుడ్ జనాలు, మీడియా కోసమైనా సరే ఆయన శవాన్ని ఒకరోజు దర్శనార్థం పెట్టాల్సింది కదా.. హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తిని చూసేందుకు చాలా మంది వస్తారు .. వచ్చేవాళ్ళ కోసం వేచి చూడడం, అందరూ ఆఖరి చూపు చూసుకున్నాకే దహన సంస్కారాలు చేస్తారు కదా.. మరి ఎందుకు నానా పటేకర్ విషయంలో చేయలేదు.

బాలీవుడ్ జనాలైనా ప్రశ్నించాలి కదా?

ముఖ్యంగా బాలీవుడ్ లో ఏ ఒక్కరు కూడా ఆయన శవాన్ని చూడలేదు. చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ నివాళి ఘటించారు.. ఎందుకు ఎవరు ఆయన శవాన్ని చూడడానికి వెళ్లలేదు.. కనీసం ఆయన అంత్యక్రియలు చేసిన కుటుంబ సభ్యులైనా ఆయన శవాన్ని చూసారా? ఎందుకంటే నేను చూసిన వీడియోలలో ఎక్కడ కూడా ఆయన శవం కనిపించలేదు.. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి ముఖాన్ని ఎందుకు మూసారు? జనాలు ఇలా ఎందుకు చేశారని అడగకపోవచ్చు కానీ బాలీవుడ్ జనాలైనా అడగాలి కదా? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇందుకు సంబంధించిన ఎన్నో ఫోటోలు , వీడియోలు వైరల్ అయ్యాయి. మరి నానా పటేకర్ కి సంబంధించిన ఒక్క వీడియో కూడా ఎందుకు బయటకు రాలేదు.

అర్ధరాత్రి అంత్యక్రియలు ఎందుకు చేశారు?

Advertisement

ఆయనకు గుండెపోటు వచ్చింది.. హాస్పత్రికి తీసుకెళ్లారు.. ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు.. పోస్ట్ మార్టం కూడా చేశారు. కానీ ఎక్కడా ఒక వీడియో కూడా బయటకు రాలేదు.. అంటే ఆయన సీసీ కెమెరాలు లేని అడవిలో ఏమైనా ఉన్నారా? నాకు తెలిసినంతవరకు హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు చేయకూడదు. కానీ నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి 11:30 గంటలకు ఎందుకు చేయాల్సి వచ్చింది. శవాన్ని పెట్టడానికి బాక్సులు లేవా? అసలు ఆ రోజు అంత్యక్రియలు చేసిన బాడీ నానా పటేకర్ ది కాదా?

also read: జైలర్ 2 మూవీ రివ్యూ.. రజినీకాంత్ జైలర్ మ్యాజిక్ రిపీట్ చేశారా?

మలేషియాలో ఎంజాయ్ చేస్తున్నాడు…

ఇక నా అనుమానం ప్రకారం ఆయన చనిపోలేదు.. మలేషియాలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. చట్టపరంగా ఉన్న అడ్డంకులను తొలగించుకోవడానికి ఫేక్ డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేశారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అంటూ ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

https://www.instagram.com/stories/iamtanushreeduttaofficial/4007764397837342409?utm_source=ig_story_item_share&cplk=NXpyNHFwbG41MzUz

Related News

ఆ ఒక్క క్షణమే పునీత్ ప్రాణం తీసిందా..ఇన్నేళ్ళకి బయటపడ్డ నిజం!

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

Big Stories

Advertisement
×