E-Paper
Advertisement

కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా? ఈ BLDC ఫ్యాన్లు వాడితే బెస్ట్

కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా? ఈ BLDC ఫ్యాన్లు వాడితే బెస్ట్
Advertisement

Best BLDC Ceiling Fans: ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి షాక్ అవుతున్నారా? ఏసీలు, ఫ్యాన్లు తిప్పితే చాలు.. కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతోంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమే BLDC సీలింగ్ ఫ్యాన్లు. సాధారణ ఫ్యాన్లతో.. పోలిస్తే ఇవి దాదాపు 65 శాతం వరకు కరెంట్ ఆదా చేస్తాయి. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’లో బెస్ట్ BLDC ఫ్యాన్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. మీ ఇంటి కరెంట్ బిల్లును తగ్గించే.. ఆ టాప్ 5 ఫ్యాన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలమైనా.. ఎండాకాలమైనా ఇంట్లో ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. దీని వల్ల ప్రతి నెలా కరెంట్ బిల్లులు భారీగా పెరిగి పోతుంటాయి. ఈ టెన్షన్ నుంచి బయట పడటానికి మార్కెట్లోకి వచ్చిన టెక్నాలజీనే BLDC మోటార్ ఫ్యాన్లు. ఈ ఫ్యాన్లు సాధారణ ఇండక్షన్ మోటార్ ఫ్యాన్ల కంటే.. చాలా తక్కువ కరెంట్ ఖర్చు వినియోగిస్తాయి. ఇంతకీ కస్టమర్లు ఎక్కువగా కొంటున్న టాప్ 5 BLDC సీలింగ్ ఫ్యాన్ల వివరాలు తెలుసుకుందామా..

టాప్ 5 BLDC సీలింగ్ ఫ్యాన్లు:

1.ఏథర్ / ఆంకోర్ బై పానాసోనిక్ / క్రాంప్టన్ ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్ :

Advertisement

క్రాంప్టన్ బ్రాండ్ ఎనర్జీ సేవింగ్ రంగంలో.. అగ్రగామిగా ఉంది. ఈ ఎనర్జియాన్ హెచ్‌ఎస్ మోడల్ రిమోట్ కంట్రోల్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే.. సుమారు 50 శాతం కంటే.. ఎక్కువ కరెంట్‌ను ఆదా చేస్తుంది. తక్కువ వోల్టేజ్ వద్ద కూడా ఇది చాలా వేగంగా గాలి ఇస్తుంది. రిమోట్ ఆపరేషన్, 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ దీని ప్రత్యేకతలు

ధర:సుమారు రూ. 2,699 నుంచి రూ.3,499 వరకు ఉంటుంది.

2.Orient Electric AeroSlim / Ekotec BLDC Fan:

Advertisement

ఓరియంట్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ BLDC ఫ్యాన్  స్టైలిష్ లుక్ , పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనికి ఉన్న ఏరోడైనమిక్ బ్లేడ్ల వల్ల రూమ్ మూలలకూ గాలి సమృద్ధిగా అందుతుంది.
సైలెంట్ ఆపరేషన్, ప్రీమియం డిజైన్ దీని ప్రత్యేకతలు.

ధర: సుమారు రూ.3,199 నుంచి రూ. 4,200 మధ్య లభిస్తోంది.

3.Atomberg Renesa BLDC Ceiling Fan:

ఇండియాలో BLDC ఫ్యాన్ల ట్రెండ్‌ను సృష్టించిన బ్రాండ్లలో అటమ్‌బెర్గ్ ముందుంటుంది. రెనెసా మోడల్ మోడర్న్ ఇళ్లకి పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది స్మార్ట్ రిమోట్ కంట్రోల్ , స్లీప్ మోడ్ ఫీచర్లతో వస్తుంది. కరెంట్ బిల్లును భారీగా తగ్గించడంలో ఇది ముందు వరుసలో ఉంటుంది.ఐవోటీ , వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఆప్షన్స్ దీని ప్రత్యేకతలు.

ధర: ఆఫర్ ప్రైస్‌లో సుమారు రూ. 3,399 నుంచి రూ.4,500 వరకు ఉంది.

ప్రత్యేకత: ఐవోటీ , వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఆప్షన్స్.

4. Luminous Audie / Lotus BLDC Fan:

లూమినస్ బ్రాండ్ నమ్మకానికి మారుపేరు.ఈ లూమినస్ BLDC ఫ్యాన్ తక్కువ పవర్ వాటేజ్‌తో (కేవలం 28 నుంచి32 వాట్లు మాత్రమే) ఎక్కువ గాలిని ఇస్తుంది. అమెజాన్ సేల్‌లో ఈ మోడల్‌పై ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. అద్భుతమైన గాలి, ఎక్కువ రోజుల వారంటీ దీని ప్రత్యేకతలు.

ధర: సుమారు రూ. 2,899 నుంచి రూ. 3,799 వరకు ఉంది.

Also Read: చిన్న రూమ్‌లోనే థియేటర్ ఫీల్..రూ.10వేలలోపు టాప్ ప్రొజెక్టర్స్!

5.Havells Efficiencia BLDC Ceiling Fan:

ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో హావల్స్ గాడ్జెట్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హావల్స్ ఎఫిషియెన్సియా ఫ్యాన్ తక్కువ కరెంట్ ఖర్చుతో ఇల్లు మొత్తాన్ని చల్లగా ఉంచుతుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పవర్‌ఫుల్ కాపర్ మోటార్ , పవర్ సేవింగ్ టెక్నాలజీ దీని ప్రత్యేకతలని చెప్పొచ్చు.

ధర: సుమారు రూ. 3,499 నుంచి రూ. 4,300 మధ్య లభిస్తుంది.

BLDC ఫ్యాన్లతో లాభాలు ఏంటి?

సాధారణ ఫ్యాన్లు సుమారు 70 నుంచి 80 వాట్ల కరెంట్ వాడితే.., ఈ BLDC ఫ్యాన్లు కేవలం 28 నుంచి 35 వాట్లు మాత్రమే వాడతాయి. అంటే దాదాపు సగానికి పైగా కరెంట్ ఆదా అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? అమెజాన్ సేల్ ముగిసే లోపు మీ ఇంటిలోని పాత ఫ్యాన్లను మార్చి, ఈ BLDC ఫ్యాన్లతో మీ కరెంట్ బిల్లును తగ్గించుకోండి!

Related News

జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఒక్క రీఛార్జ్‌తో మరో నెల ఉచితం.. అర్హులు ఎవరో తెలుసా?

రూ.50వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు..బ్యాంక్ ఆఫర్లో బ్రాండెడ్ మోడల్స్!

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ 80% దగ్గరే ఆగిపోతుందా? బ్యాటరీ పాడైపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే!

చిన్న రూమ్‌లోనే థియేటర్ ఫీల్..రూ.10వేలలోపు టాప్ ప్రొజెక్టర్స్!

వాట్సప్‌లో ఇప్పటివరకు రాని క్రేజీ ఫీచర్.. ఇది తెలిస్తే గాల్లో తేలిపోతారు!

రియల్ మీ నుంచి బిగ్గెస్ట్ టీవీ..100 ఇంచుల క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ వచ్చేసింది!

ఇక ఎండతో పనే లేదు! బట్టలను 100% డ్రై చేసే టాప్ 5 వాషింగ్ మెషీన్లు!

Big Stories

Advertisement
×