LinkedIn Privacy Issue: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు డేటా ప్రైవసీ, కార్పొరేట్ టూల్స్ దుర్వినియోగంపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. లింక్డ్ ఇన్ లో జాబ్ పర్పస్ కోసం ఓ యువతి కంపెనీ హెచ్ ఆర్ లకు మాత్రమే కనిపించేలా పెట్టిన మెుబైల్ నెంబర్ ను ఓ వ్యక్తి దుర్వినియోగం చేశాడు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (CRM) వ్యవస్థను ఉపయోగించుకొని వ్యక్తిగత ఫోన్ నంబర్ను సేకరించడమే కాకుండా.. ఆమె వ్యక్తిగత విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం కొత్త ఆందోళనకు దారి తీసింది.
బాధిత మహిళ షేర్ చేసిన స్క్రీన్షాట్ల ప్రకారం.. ‘అభిషేక్’ అనే వ్యక్తి లింక్డ్ఇన్, అపోలో (Apollo) అనే సేల్స్ ప్రాస్పెక్టింగ్ టూల్ సహాయంతో ఆమె నంబర్ సంపాదించాడు. వాట్సాప్లో ఆమెతో చాట్ చేసేందుకు యత్నించాడు. దీంతో బాధితురాలు ఆ వివరాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘ప్రతిచోటా ఇలాంటి మగవాళ్లే’ (Creeps everywhere) అని ఆ పోస్ట్ కు క్యాప్షన్ పెట్టింది.
Wanted to help but had to block https://t.co/hTmCS8njHa
— Swishhhhtiii (@Swisss_tea) October 14, 2026
అపరిచిత వ్యక్తితో వాట్సప్ చాట్ సందర్భంగా.. బాధితురాలు తన నంబర్ ఎలా దొరికిందని ప్రశ్నించింది. అందుకు అతడు బదులిస్తూ తన పేరు అభిషేక్ అని, తాను అపోలో (Apollo) అనే సీఆర్ఎం టూల్ వాడానని బదులిచ్చాడు. సాధారణంగా ఇది బిజినెస్ లీడ్స్ కోసం, ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు సేకరించడానికి వాడతారని అతనే స్వయంగా అంగీకరించాడు. క్యూట్ ఉన్నావన్న కారణంతోనే వ్యక్తిగత ఫోన్ నెంబర్ సేకరించి.. ఇలా వాట్సప్ చాట్ చేస్తున్నట్లు నిందితుడు బాధితురాలికే చెప్పడం గమనార్హం.
Also Read: భార్యపై భర్త పైశాచికత్వం.. నచ్చిన కూర వండలేదని.. శరీరంపై పలుమార్లు కొరికి, బండరాయితో దాడి!
సాధారణంగా లింక్డ్ఇన్ అనేది ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు, రిక్రూట్మెంట్, వృత్తిపరమైన వ్యాపార సంబంధాల కోసం రూపొందించిన ప్లాట్ఫారమ్. ఒక వ్యక్తి ప్రొఫైల్లో ఉన్నా లేదా థర్డ్-పార్టీ టూల్స్ ద్వారా నెంబర్ సేకరించినప్పటికీ.. నేరుగా వ్యక్తిగత మెసేజ్ లు పంపడం కరెక్ట్ కాదని నిపుణులు సూచిస్తున్నారు. బిజినెస్ లీడ్స్ కోసం ఉద్దేశించిన సాధనాలు ఇలాంటి వ్యక్తిగత అవసరాలకు, వేధింపులకు ఉపయోగించడం దారుణమని పేర్కొంటున్నారు. ఇది ఆన్లైన్లో సమాచారాన్ని పంచుకునే వ్యక్తుల గోప్యతను ప్రమాదంలోకి నెడుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read: భర్త లేని సమయం చూసి దారుణం.. ప్రేయసిని హత్య చేసి.. పరారైన ఏసీ టెక్నీషియన్!