E-Paper
Advertisement

రోజుకు 15 గంటలు పస్తు.. నరకం అనుభవించలేక చంపేయమన్నాను – సుప్రీత!

రోజుకు 15 గంటలు పస్తు.. నరకం అనుభవించలేక చంపేయమన్నాను – సుప్రీత!

Supritha: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎలా అయితే పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారో.. తమ వారసులకి కూడా అంతే ఇమేజ్ అందించి పెడుతున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కి మరింత చేరువయ్యారు. అలాంటి వారిలో సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు, వీడియోలతో అతి తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ

రోజుకు 15 గంటలు ఉపవాసం..

ముఖ్యంగా కరోనా సమయంలో తన తల్లితో కలిసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరియర్ ప్రారంభించిన సుప్రీత ఇప్పుడు సినిమాలలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు జానీ మాస్టర్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా.. బిగ్ బాస్ రన్నరప్ అమర్దీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జాతి రత్నాలు’ అనే కామెడీ షో కి ఈమె కూడా అమర్ దీప్ తో కలిసి హోస్ట్ గా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత మాట్లాడుతూ..” రోజుకు 15 గంటలు పస్తు ఉండేదాన్ని.. ఆ నరకం అనుభవించలేక చంపేయమని వేడుకున్నాను అంటూ సుప్రీత ఎమోషనల్ కామెంట్లు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

నరకం భరించలేక చంపేయమన్నాను – సుప్రీత

ఇంటర్వ్యూలో భాగంగా సుప్రీత మాట్లాడుతూ..” సోషల్ మీడియాలో వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్ల వల్ల నేను మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఫలితంగా బరువు తగ్గాలనే ఆరాటంలో నా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకున్నాను. రోజుకు 15 గంటల పాటు ఏమి తినకుండా పస్తులు ఉండేదాన్ని. అయితే తిన్న ఆ ఒక్క పూట కూడా బిర్యాని వంటి హెవీ ఫుడ్ తీసుకోవడంతో నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది . తీవ్ర అనారోగ్యానికి గురై 15 రోజుల పాటు హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. నేను ఎలా అయితే రోజుకు 15 గంటల పాటు ఉపవాసం ఉన్నానో అదే విధంగా రోజుకు 15 సార్లు వాంతులు కూడా అయ్యేవినీళ్లు తాగినా సరే బయటకు వచ్చేవి.ఆ దశలో బాధను భరించలేక నన్ను చంపేయమని కోరుకున్నాను” అంటూ అసలు విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది సుప్రీత. ఇక సోషల్ మీడియా బాడీ షేమింగ్ కారణంగా ఈమె పడ్డ ఇబ్బందుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సుప్రీత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:ఆ కెపాసిటీ నాకు లేదు.. మల్టీ స్టారర్ నుండి తప్పుకోవడంపై డైరెక్టర్ క్లారిటీ!

వారికి సిస్టర్ గా చేయడానికి కూడా వెనుకాడను..

ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ..” ప్రస్తుతం నేను కోలుకున్నాను. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా మంచి స్క్రిప్ట్ దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా సిద్ధమవుతున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోల చిత్రాలలో చెల్లెలు పాత్ర వచ్చినా సరే వదులుకోను అంటూ తెలిపింది. అలాగే విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేని లాంటి హీరోల సరసన మాత్రం చెల్లెలిగా పాత్రలు చేయడం చాలా కష్టం అంటూ సరదాగా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే స్టార్ హీరోల సినిమాలలో సిస్టర్ రోల్ ఇచ్చినా సరే చేస్తానని డైరెక్టర్లకు ముందుగానే హింట్ ఇచ్చింది సుప్రీత

Related News

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

Big Stories

×