E-Paper
Advertisement

Assam Elections Results 2026: అస్సాం వార్ వన్ సైడ్.. ఎన్డీయే దూకుడు.. కాంగ్రెస్ వెనుకంజ‌

Assam Elections Results 2026: అస్సాం వార్ వన్ సైడ్.. ఎన్డీయే దూకుడు.. కాంగ్రెస్ వెనుకంజ‌
Advertisement

Assam Elections Results 2026: అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను 64 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఉండగా, అధికార ఎన్‌డీఏ (NDA) సంకీర్ణ ప్రభుత్వం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తొలి దశ లెక్కింపు సరళిని గమనిస్తే, ఎన్‌డీఏ 84 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు కేవలం 27 స్థానాలకే పరిమితమయ్యాయి. ఈశాన్య రాష్ట్రంలో నమోదైన రికార్డు స్థాయి పోలింగ్ (సుమారు 85.91 శాతం), ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

కీలక నియోజకవర్గాలు – ప్రముఖ నేతల ఆధిక్యం
ఈ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కొన్ని కీలక నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ తన సంప్రదాయ నియోజకవర్గమైన జాలూక్‌బరి నుండి భారీ ఆధిక్యంతో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ జోర్హట్ స్థానంలో గట్టి పోటీ ఇస్తూ ముందంజలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో అభివృద్ధి, అక్రమ చొరబాట్ల నిరోధం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రధానంగా ప్రచారం చేసిన ఎన్‌డీఏ, హ్యాట్రిక్ విజయం దిశగా పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

అభివృద్ధి, గుర్తింపు రాజకీయాలపై ప్రజల తీర్పు
అస్సాం అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు, స్థానిక సంస్కృతి, గుర్తింపును పరిరక్షించాలన్న నినాదంతో బీజేపీ బరిలోకి దిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతల స్థిరీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయాన్ని అందించాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ప్రజలు మాత్రం స్థిరమైన మరియు ప్రగతికి ప్రాధాన్యతనిచ్చే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మొగ్గు చూపినట్లు తాజా ఫలితాల సరళి సూచిస్తోంది.

Also Read: పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ లైవ్.. పోస్టల్ బ్యాలెట్లలో కమలం దూకుడు.. నువ్వా-నేనా అంటున్న టీఎంసీ!

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×