Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఉగాది స్పెషల్‌గా మార్చి 19న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా, మార్చి 15, ఆదివారం హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక (Ustaad Bhagat Singh Pre Release Event)ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకను నిర్వహించిన ఆర్గనైజర్స్, చిత్ర నిర్మాతలకు పోలీసులు షాకిచ్చారు. అవును, వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వారిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే..
Also Read- Romantic Drama OTT: అలల మీద విరబూసిన అందమైన ప్రేమ…కొసరి కొసరిగా ప్రియుడి మత్తులో…
పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ అనగానే అభిమానులు ఎలా తరలివస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ‘పుష్ప 2’ ప్రీమియర్ షో టైమ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్‌కు కొన్ని ఆంక్షలు విధించింది. మళ్లీ మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, వేడుకలను లిమిటెడ్ మెంబర్స్‌తో జరుపుకోవాలని, పోలీసు వారికి సహకరించాలనేలా కొన్ని నిబంధనలను విధించింది. అప్పటి నుంచి దాదాపు ఇలానే సినిమా వేడుకలు జరుగుతున్నాయి. కానీ మార్చి 15న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు పోలీసు వారు కేవలం 1500 మందితో మాత్రమే ఈవెంట్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. కానీ, ఆర్గనైజర్స్ మాత్రం అంతకు డబుల్ కాదు, త్రిబుల్ రెట్లు పాస్‌లను పంచినట్లుగా పోలీసులు నోటీస్ చేశారు.
Also Read- Samantha:బెడ్ రూమ్ లో భర్త రాజ్ నిడిమోరి ఏం చేస్తున్నారో పోస్ట్ పెట్టిన సమంత..!
అందుకే ఈ వేడుకకు దాదాపు 5 వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అనుమతికి మించి భారీ ఎత్తున జనసమీకరణ జరగడంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి యూసఫ్‌గూడ వైపు వెళ్లే రోడ్లన్నీ గంటల తరబడి ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి. దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు పదేపదే హెచ్చరించినప్పటికీ, ఆర్గనైజర్లు జనాలను నియంత్రించలేకపోయారు. ఇంకా భద్రతా పరమైన జాగ్రత్తలు కూడా పాటించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించినందుకు, ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు గాను జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అది అసలు విషయం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
Also Read- Bigg Boss syed Sohel: అమ్మను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ సోహెల్…భరోసా ఇచ్చిన అలీ..