E-Paper
Advertisement

Suriya 50th Film: సూర్య 50వ సినిమా చుట్టూ వివాదాలే.. ఎందుకంటే..?

Suriya 50th Film: సూర్య 50వ సినిమా చుట్టూ వివాదాలే.. ఎందుకంటే..?
Advertisement

Suriya 50th Film: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ గురించి ప్రస్తుతం ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. కంగువా.. రెట్రో సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. సూర్య మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తన పనిపై పూర్తి దృష్టి పెట్టి, వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సూర్య చేతిలో ఉండేవి బోలెడు సినిమాలు..!

ప్రస్తుతం సూర్య రెండు సినిమాల షూటింగ్ దాదాపు పూర్తి చేశాడు. వాటిలో ఒకటి కరుప్పు, దీనికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. మరో సినిమా తాత్కాలికంగా సూర్య 46 అనే పేరుతో తెరకెక్కుతోంది. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అయినా కూడా సూర్య విశ్రాంతి తీసుకోకుండా, తన తదుపరి సినిమా పనులు కూడా మొదలుపెట్టాడు.
ఇప్పటికే సూర్య తన 47వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దీనికి జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చూస్తే, సూర్య ఎంత క్రమశిక్షణతో, స్థిరంగా సినిమాలు చేస్తున్నాడో అర్థమవుతుంది. అభిమానులు కూడా ఆయన ఈ స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

సూర్య 50వ సినిమాపై కీలక అప్డేట్..!

Advertisement

ఇదిలా ఉండగా.. సూర్య 50వ సినిమాపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మైలురాయి సినిమా కోసం ఆయన దర్శకుడు మారి సెల్వరాజ్తో కలిసి పనిచేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కళైపులి ఎస్ తాను నిర్మించనున్నారని సమాచారం. గతంలో సూర్య ..తాను కలయికలో చేయాల్సిన వాడివాసల్ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అందుకే ఆ ప్రాజెక్ట్‌కు పరిహారంగా ఈ సినిమా చేస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.

అయితే..మారి సెల్వరాజ్ ఇప్పటికే చాలా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ధనుష్‌తో డి56, కార్తితో ఒక సినిమా, ఇన్‌బన్ ఉదయనిధితో మరో సినిమా వంటి ప్లాన్స్ ఉన్నాయి. దీంతో ఈ కలయిక ఎప్పుడు సాధ్యం అవుతుందనే సందేహాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం కోలీవుడ్ లో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నయ్. నిర్మాతలు అప్పట్లో ప్రాజెక్ట్ ఆగిపోయిన కారణంగా ఇప్పుడు సూర్యని తప్పకుండా 50వ సినిమా తమతో చేయాలి అని అడుగుతున్నారని వినిపిస్తోంది.

Advertisement

సోషల్ మీడియాలో అభిమానుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు మారి సెల్వరాజ్ కథల బలాన్ని ప్రశంసిస్తూ..సూర్యకు ఇది మంచి ఛాయిస్ అని కూడా అంటున్నారు. మరికొందరు మాత్రం 50వ సినిమాకు కమర్షియల్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారు.

ప్రస్తుతం ఇవన్నీ కేవలం ఊహాగానాలే. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. షెడ్యూల్స్ క్లియర్ అయిన తర్వాతే సూర్య 50వ సినిమా గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ALSO READ: Malavika Mohanan: గ్లామర్ తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ బ్యూటీ!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×