E-Paper
Advertisement

America: అమెరికాలో దారుణం.. రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు

America: అమెరికాలో దారుణం.. రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు
Advertisement

America: అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారుల (ICE) కఠిన చర్యలు మరోసారి మానవ హక్కుల చర్చకు తెరలేపాయి. ఇటీవల ఒక ఐదేళ్ల బాలుడిని నిర్బంధించిన ఘటన మరువకముందే, మిన్నెపొలిస్‌లో రెండేళ్ల పసికందును తండ్రితో సహా అదుపులోకి తీసుకోవడం స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ పరిణామం వలసదారుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

మిన్నెపొలిస్ నగర కౌన్సిల్ సభ్యుడు జాసన్ చావెజ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎల్విస్ జోయెల్ తన రెండేళ్ల కుమార్తె క్లోయీ రెనెటా టిపాన్‌తో కలిసి కిరాణా దుకాణం నుండి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వాహనం ఒకటి వారిని వెంబడించి, ఆకస్మికంగా అడ్డగించింది. అందులో ఉన్న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు, కారు అద్దాలను పగలగొట్టి మరీ వారిని అదుపులోకి తీసుకోవడం అక్కడి వారిని భయాందోళనకు గురిచేసింది.

Advertisement

అధికారుల తీరుపై విమర్శలు
సాధారణంగా నేరచరిత ఉన్న వారిని పట్టుకునే క్రమంలో ఇటువంటి చర్యలు తీసుకుంటారు. అయితే, పసిపాపతో కలిసి వెళ్తున్న వ్యక్తి పట్ల ఇంతటి కఠినత్వాన్ని ప్రదర్శించడంపై పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కారు అద్దాలు పగలగొట్టడం వల్ల చిన్నారి మానసికంగా ఎంతటి ఆందోళనకు గురై ఉంటుందోనని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేసే క్రమంలో మానవత్వాన్ని మర్చిపోకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

అమెరికాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు..
గత కొద్దికాలంగా అమెరికా ప్రభుత్వం వలసల విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దీనివల్ల అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. కేవలం ఐదేళ్ల లోపు పిల్లలను కూడా నిర్బంధ కేంద్రాలకు తరలించడం అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది. ఈ మిన్నెపొలిస్ ఘటనతో వలసదారుల భద్రత, వారి హక్కులపై మరోసారి న్యాయ పోరాటాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Also Read: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. బాధిత కుటుంబానికి మద్దతుగా స్థానిక ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. నిబంధనల పేరుతో పసిపిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదని, ఇమిగ్రేషన్ విధానాల్లో సంస్కరణలు రావాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Related News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

Big Stories

Advertisement
×