E-Paper
Advertisement

Suriya – Jyothika: సూర్య – జ్యోతిక పెళ్లి వెనక ఎన్నో అడ్డంకులు.. చివరికి కథ ఎలా సుఖాంతం అయిందంటే..!

Suriya – Jyothika: సూర్య – జ్యోతిక పెళ్లి వెనక ఎన్నో అడ్డంకులు.. చివరికి కథ ఎలా సుఖాంతం అయిందంటే..!
Advertisement

Suriya – Jyothika రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ జంటల కథలు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి అందమైన ప్రేమ కథల్లో సూర్య–జ్యోతికల లవ్ స్టోరీ ప్రత్యేకమైనది. ఈ ప్రేమ కథ గురించి సూర్య తండ్రి శివకుమార్ ఒకసారి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శివకుమార్ చెప్పిన ప్రకారం, మొదట్లో ఆయన సూర్య, జ్యోతికల ప్రేమను అంగీకరించలేదట. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరూ కలిసి పని చేస్తుండగా వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ విషయం ఇంట్లో చెప్పినప్పుడు తండ్రిగా శివకుమార్ కొంత ఆలోచించారట. వెంటనే ఒప్పుకోలేకపోయానని ఆయన స్పష్టంగా చెప్పారు.

Advertisement

అయితే సూర్య మాత్రం తన నిర్ణయంలో చాలా కట్టుదిట్టంగా నిలబడ్డాడట. “జ్యోతికనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం ఒంటరిగా ఉంటాను” అని తండ్రికి చెప్పాడట. తన ప్రేమపై సూర్యకు ఎంత నమ్మకం ఉందో ఆ మాటలతో తెలుస్తోంది.

తర్వాత శివకుమార్ ఒక విషయం గుర్తు చేసుకున్నారట. తాను సుమారు 150 సినిమాల్లో నటించానని, వాటిలో ఎక్కువ సినిమాల్లో ప్రేమ వివాహాలే చూపించామని చెప్పారు. సినిమాల్లో ప్రేమను సమర్థిస్తూ నటించిన నేను, నిజ జీవితంలో నా కొడుకు ప్రేమను ఎందుకు అంగీకరించకూడదు? అని తనలో తానే ఆలోచించారట. ఆ ఆలోచనతో చివరకు సూర్య, జ్యోతికల పెళ్లికి ఓకే చెప్పారని వెల్లడించారు.

Advertisement

సూర్య, జ్యోతికలు కలిసి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. వారి జంటను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డారు. ప్రేమతో మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు అందమైన కుటుంబ జీవితంగా మారింది. ఇద్దరూ కలిసి మంచి దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

వాలెంటైన్స్ డే రోజున ఈ ప్రేమ కథ మరింత స్పూర్తినిస్తోంది. ప్రేమపై నమ్మకం ఉంటే ఎలాంటి అడ్డంకులైనా దాటవచ్చని సూర్య–జ్యోతికల కథ చెబుతోంది. ఇప్పటికీ కూడా వీరిద్దరూ చూడముచ్చటగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ప్రేమకు.. గౌరవం ఇచ్చిన శివకుమార్ మాటలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. నిజమైన ప్రేమకు కుటుంబ ఆశీర్వాదం కూడా కలిస్తే జీవితం ఇంకా అందంగా మారుతుందని ఈ కథ స్పష్టం చేస్తోంది.

ALSO READ: Thalapathy Vijay: ప్రభుత్వం ఇచ్చే డబ్బును తీసుకోండి కానీ ఓటు మాత్రం టీవీకేకే వేయండి… దళపతి విజయ్

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×