E-Paper
Advertisement

Food Discrimination: శ్రమ నీది.. అండ మాది.. కోవా బన్ వ్యాపారికి సోషల్ మీడియా సెల్యూట్!

Food Discrimination: శ్రమ నీది.. అండ మాది.. కోవా బన్ వ్యాపారికి సోషల్ మీడియా సెల్యూట్!
Advertisement

Food Discrimination: వ్యాపారంలో ఎవరైనా తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుంటే దానిని ప్రోత్సహించాల్సింది పోయి.. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మతం రంగు పులిమి విమర్శించడం విచారకరం. అసలు కేవలం  రూ. 10కే కోవా బన్  ఎలా ఇస్తావు? ఇందులో ఏదో కలిపావు! అంటూ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని కాకుండా.. కష్టపడి పని చేసే శ్రమజీవులందరినీ అవమానించడమే. అయితే.. సోషల్ మీడియా నెటిజన్లు ఈ వివక్షను తిప్పికొట్టారు. కులమతాలకు అతీతంగా సదరు వ్యక్తికి అండగా నిలబడి.. మానవత్వాన్ని చాటుకున్నారు.

సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు లేదా కార్పొరేట్ సంస్థలు ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్లు లేదా భారీ డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఎవరూ వెళ్లి ‘ఎందుకు ఇంత తక్కువకు ఇస్తున్నారు?’ అని నిలదీయరు. కానీ.. ఒక సామాన్యుడు తక్కువ ధరకే కడుపు నింపుతుంటే మాత్రం కుట్రలు ఆపాదించడం సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తుంది. వ్యాపార వ్యూహంలో భాగంగా ఎవరైనా తమ లాభాన్ని తగ్గించుకుని వస్తువులను అమ్మే హక్కు వారికి ఉంటుంది.

Advertisement

ఆహార నాణ్యతను పరీక్షించడానికి ప్రభుత్వం తరపున FSSAI వంటి సంస్థలు ఉన్నాయి. వారు హోటళ్లపై దాడులు చేసి.. లోపాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తప్ప.. ఎవరినీ బహిరంగంగా అవమానించరు. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని.. కెమెరాల ముందు వేధించడం ఏ రకమైన జర్నలిజం లేదా సామాజిక బాధ్యత అనిపించుకోదు.

ఒకరి ఎదుగుదలని చూసి ఓర్వలేక చేసే విమర్శలు ఎప్పుడూ నిలవవు. నిజాయితీగా పని చేసే వారికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.

Advertisement

Also Read:  విశాఖ ప్యాలెస్ కోసం గీతంపై కుట్రలు.. గత పాలనపై ఎంపీ సంచలన ఆరోపణలు

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×