BigTV English
Advertisement

Suryakantham: గయ్యాళి అత్తనే భయపెట్టిన మహిళ.. నడిరోడ్డుపై కడిగిపారేసిందిగా!

Suryakantham: గయ్యాళి అత్తనే భయపెట్టిన మహిళ.. నడిరోడ్డుపై కడిగిపారేసిందిగా!

Suryakantham:సినిమాల్లో చేసే కొన్ని పాత్రలు ప్రేక్షకుల్లోకి బలంగా చొచ్చుకొని పోతాయి. వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే ఆ పాత్రలతోనే ప్రేక్షకులు వారిని గుర్తు పడుతుంటారు. పైగా సీరియల్ లో విలన్ పాత్రలో నటించే వారు బయట ఎక్కడైనా కనిపిస్తే ఎలా అయితే తిట్టుకుంటారో.. సినిమాల్లో విలనిజంతో మెప్పించే వారిని కూడా బయట కనిపిస్తే అదేవిధంగా తిట్టుకుంటారు. అయితే ఇలాంటి ఒక చేదు సంఘటన గయ్యాళి అత్త పాత్రలో నటించే సూర్యకాంతానికి కూడా ఎదురైందట. సూర్యకాంతం పేరు చెప్పగానే ఇప్పటి జనరేషన్ కి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ ఒకప్పుడు ఈమె ఒక స్టార్ నటి.. గయ్యాళి అత్త పాత్రలో ఇరగదీసేది.. అలా ఈ నటి ఎన్నో సినిమాల్లో తన గయ్యాళి తనంతో మెప్పించి అందర్నీ హడలెత్తించింది.


విలనిజానికి కేరాఫ్ అడ్రస్ సూర్యకాంతం..

అయితే సినిమాల్లో విలనిజం చూపించే ప్రతి ఒక్కరూ బయట కూడా విలన్ గానే ఉంటారు అంటే పొరపాటు పడ్డట్లే. అలాగే సినిమాల్లో హీరోలుగా చేసే వాళ్ళందరూ బయట హీరో అనుకుంటే కూడా పొరపాటు పడ్డట్లే. అలా సినిమాల్లో గయ్యాళి అత్తగా నటించిన సూర్యకాంతం బయట మాత్రం చాలా మృదుస్వభావి. ఆమె ఎంతోమందికి సహాయం చేసేది. ముఖ్యంగా ఇంటి నుండి వచ్చే సమయంలోనే షూటింగ్ సెట్లో ఉన్నవారందరికీ రకరకాల వంటలు చేసుకొని తీసుకువచ్చేది. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అయితే ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఆమెతో ఉన్నవారికి తప్ప మిగతా వారికి తెలియదు కదా.. సినిమాల్లో ఉన్నట్టుగానే బయట కూడా ఆమె వ్యక్తిత్వం ఉంది అని చాలామంది అనుకుంటారు అయితే ఇలాగే ఓ మహిళ కూడా అనుకుందట.

గయ్యాళి అత్తనే కడిగిపారేసిన మహిళ..

ఓ రోజు సూర్యకాంతం మద్రాస్ నుండి నెల్లూరు వెళుతున్న సమయంలో కారు ఆగిపోవడంతో అక్కడే కాసేపు ఉండాల్సి వచ్చిందట. అలా డ్రైవర్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ కారుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని తెలుసుకునే పనిలో పడగా.. అటుగా వెళ్తున్న ఓ మహిళ కార్లో ఉన్న సూర్యకాంతాన్ని చూసి సినిమాల్లో గయ్యాలీ పాత్రలో కనిపించేది ఈమెనే కదా అని గుర్తుపట్టి.. సూర్యకాంతం దగ్గరికి వచ్చి..”ఏవమ్మా గయ్యాళి అత్త.. ఇంకా ఎంతమంది కాపురాలు కూలుస్తావు.. నీకు ఇదే పనా.. ఎవరైనా బాగుంటే నీ కళ్ళు ఓర్వవా..ఇంకా ఎంతమంది కాపురాల్లో చిచ్చు పెట్టి ఎంతమంది ఉసురు పోసుకుంటావు.. నీకు ఈ పని తప్ప మరే పని లేదా.. అందరినీ ఇబ్బంది పెట్టి ఇప్పుడేమో హాయిగా కార్లలో తిరుగుతున్నావా?” అంటూ సూర్యకాంతానికి మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఫటాఫట్ తన నోటి నుండి వచ్చే మాటలతో సూర్యకాంతాన్ని హడలెత్తించిందట.


ALSO READ:Bigg Boss 9 Promo: హీటెక్కిన నామినేషన్స్ రచ్చ.. పాయింట్స్ తో అదరగొట్టేసిన భరణి!

దిక్కుతోచని స్థితిలో సూర్యకాంతం..

అయితే నేను అలా సినిమా కోసం చేశాను.నిజ జీవితంలో అలా కాదు అని సూర్యకాంతానికి చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా కడిగిపారేసిందట. ఒకవేళ నోరు విప్పితే ఎక్కడ తన నెత్తి మీద ఉన్న కుండని తన తలపై బోర్లిస్తుందో అని భయంతో సూర్యకాంతం నోట్లో నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయిందట. ఆ తర్వాత వెంటనే తొందరగా కార్ రిపేర్ చేయండని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారట.అలా ఆరోజు సూర్యకాంతానికి అనుకొని చేదు సంఘటన ఎదురయిందట. అయితే చేదు సంఘటన అనకపోవడం కంటే సూర్యకాంతానికి బయట ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో ఈ ఒక్క సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యకాంతం చేసే పాత్రలు ప్రేక్షకుల్లోకి ఎంత బలంగా వెళ్తున్నాయో ఆ మహిళ తిట్టిన తిట్లను బట్టి అర్థం చేసుకోవచ్చు.ఇక తాజాగా సూర్యకాంతం శత జయంతి సందర్భంగా ఈ విషయం మరోసారి వైరల్ అవుతుంది.

Related News

Naveen polishetty -Raviteja: రవితేజ నవీన్ పోలిశెట్టి హీరోలుగా మల్టీ స్టారర్.. క్రేజీ కాంబో అంటూ!

Bahubali: బాహుబలి మూవీ కోసం హాలీవుడ్ డైరెక్టర్.. ప్రపంచ దృష్టి తనవైపే!

Anushka Shetty: బాహుబలి,భళ్ళాలదేవ  ఒకే.. మరి దేవసేన ఎక్కడ? అందరి కళ్ళు ఆమెపైనే?

Dacoit Release: ఉగాది బరిలో డెకాయియ్.. యశ్ టాక్సిక్ కు పోటీగా అడివిశేష్

Samantha: తప్పు చేశాను.. ఫైనల్‌గా నిజం ఒప్పుకున్న సమంత!

Fauzi Movie: ‘ఫౌజీ’లో జూనియర్‌ ప్రభాస్‌గా ఘట్టమనేని వారసుడు..

HBD Aditi Rao Hydari :అదితి రావు – సిద్దార్థ్ లగ్జరీ ఇంటిని చూశారా..? ప్రత్యేకతలకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

Big Stories

×