CM Chandrababu On Montha: మొంథా తుపాను ఏపీ వైపు దూసుకువస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మంగళవారం రాత్రి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఇక కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి.
దూసుకొస్తున్న మొంథా తుపాను
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ అలర్టయ్యింది. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. మొంథాపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
మరోవైపు ఈ ఉదయం సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తుపాను దృష్ట్యా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపు ఇచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచన చేశారు. అలాగే జిల్లాల కలెక్టర్ల మొదలు వివిధ విభాగాల అధికారులను ఎప్పటికప్పుడు RTGS సెంటర్ నుంచి అలర్ట్ చేస్తున్నారు.
నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
338 మండలాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో టీడీపీ నేతలు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్‌లో కొండ నుండి బండ రాళ్లు జారిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలియగానే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. సిబ్బందితో వాటిని క్లియర్ చేయించారు. అటు మల్కాపురంలో నీటమునిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యే గణబాబు పర్యటించారు.
మొంథా తుఫాన్ కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురస్తుండడంతో గాజువాక-యారాడ సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో యారాడ నుంచి గంగవరం వస్తున్న బస్సులు నిలిచిపోయాయి.
ALSO READ: మొంథా ఎఫెక్ట్.. ఆ రూట్లలో బస్సులు నిలిపివేత
అటు కాకినాడ తీరంలోని ఏటి మొగ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. తుపాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పునరావాస కేంద్రాలకు వెళ్ళేలా ప్రజలను ఒప్పిస్తున్నారు మంత్రి సుభాష్. పునరావాస కేంద్రాల్లో అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
విశాఖ మల్కాపురంలో నీటమునిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు.#AndhraPradesh#Visakhapatnam #Vizag #telugunews #VizagNews #AndhraNews pic.twitter.com/fYw4bP8oSk
— Vizag News Man (@VizagNewsman) October 28, 2025
ఏటి మొగ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు.#APpreparesForMontha #CycloneMontha #AndhraPradesh pic.twitter.com/9irWDD8QZE
— Telugu Desam Party (@JaiTDP) October 28, 2025