Shafali Verma: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో ( ICC Womens World Cup 2025 ) టీమిండియా దూసుకుపోతున్న నేపథ్యంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బంతి ఆపబోయి, కింద పడిపోయారు ప్రతీకా రావల్. దీంతో ఆమె కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 30వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రతీకా రావల్ ( Pratika Rawal) సెమీ ఫైనల్ ఆడబోదని తెలుస్తోంది. గాయం తీవ్రతరం కావడంతో ప్రతీకా రావల్ స్థానంలో మరో డేంజర్ ప్లేయర్ ను దించుతున్నారు. ప్రతీకా రావల్ స్థానంలో షెఫాలీ వర్మ ( Shafali Verma ) జట్టులోకి రాబోతున్నారట. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. రేపు ఇంగ్లాండు వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఎల్లుండి ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ ఉంటుంది. అయితే ఎల్లుండి మ్యాచ్ ఉన్న నేపథ్యంలో… టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తున్న ప్రతీకా రావల్ ( Pratika Rawal) కు గాయం అయింది. బౌండరీ గేటు దగ్గర బంతిని ఆపబోయి ఆమె కాలు బెణికినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి వైదొలిగారు ప్రతీకా రావల్. దీంతో ప్రతీకా రావల్ స్థానంలో లేడి విరాట్ కోహ్లీ రంగంలోకి దిగుతున్నారు. షెఫాలీ వర్మ జట్టులోకి వస్తున్నారు. లేడీ కోహ్లీగా పేరు పొందిన షెఫాలీ వర్మ బ్యాటింగ్ లో దుమ్ము లేపుతారు. ప్రత్యర్థి ఎవరైనా సరే, ఓపెనర్ గా వచ్చినా, ఏ స్థానంలో బ్యాటింగ్ కు దింపినా షెఫాలీ వర్మ మాత్రం దుమ్ము లేపడం పక్క అంటున్నారు క్రీడా విశ్లేషకులు. దీంతో అభిమానులు చాలా ఖుషి అవుతున్నారు.
ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండవ సెమీ ఫైనల్ అక్టోబర్ 30వ తేదీన అంటే ఎల్లుండి జరగనుంది. ఈ మ్యాచ్ నావి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లు ఫ్రీగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు వస్తాయి.
🚨 Shafali Verma set to join India's World Cup squad for the knockouts.#CricketTwitter #CWC25 Via: ESPN Cricinfo pic.twitter.com/RHvVmyyiV0
— Female Cricket (@imfemalecricket) October 27, 2025