E-Paper
Advertisement

ట్రోలర్స్ నోరు మూయించిన ‘రాంజనా’ బ్యూటీ.. నెట్టింట వైరల్!

ట్రోలర్స్ నోరు మూయించిన ‘రాంజనా’ బ్యూటీ.. నెట్టింట వైరల్!
Advertisement

Swara Bhasker News: స్వరా భాస్కర్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన ఈ బాంబే బ్యూటీ తెగ ఫైర్ అయిపోతుంది. తనపై జరుగుతున్న బాడీ షేమింగ్‌పై రియాక్ట్ అవుతూ “ఆడాళ్లేమీ అందాల బొమ్మలు కాదు” అంటూ ఇచ్చిన సాలిడ్ రిప్లయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరింతకీ ఈ భామ విషయంలో జరుగుతున్న ఆ హాట్ డిస్కషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

డెలివరీ తర్వాత బాడీలో మార్పులు రావడం సహజం

Advertisement

‘తను వెడ్స్ మను’, ‘రాంజనా’ వంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న స్వరా భాస్కర్.. 2023లో తన కుమార్తె రాబియాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక డెలివరీ తర్వాత బాడీలో మార్పులు రావడం సహజం కూడా. అయితే ఈ మధ్య తన పాత ఫోటోను (2018), ప్రస్తుత ఫోటోను కలిపి ఒక కొలాజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆపుకోని కొందరు ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయిందని, బరువు పెరిగిందని, గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

also read:షూటింగ్‌లు బంద్.. కోలీవుడ్‌లో టెన్షన్ టెన్షన్!

Advertisement

దీంతో ఈ కామెంట్స్‌పై ఫైర్ అవుతూ “ఒక ప్రాణానికి జన్మనివ్వడం అంటే ప్రకృతిలో అత్యంత అద్భుతమైన విషయం. ఆ సమయంలో బాడీ ఎన్నో మార్పులకు గురవడం చాలా సహజం. బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ ఇంతకుముందులానే ఉండాలని ఫోర్స్ చేయడం క్షమించరాని విషయం. ఆడాళ్లు షోకేస్‌లో పెట్టే అందాల బొమ్మలు అసలే కాదు” అంటూ తనదైన శైలిలో గట్టిగా రియాక్ట్ అయింది.

నటనకు.. బరువుకు సంబంధం ఏంటి?

ఇక యాక్టింగ్ కెరీర్‌ను బాడీ వెయిట్‌తో ముడిపెట్టే వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. “నటన అనేది టాలెంట్‌కు సంబంధించిన విషయం. దానికి మనిషి బరువుతోనో, గ్లామర్‌తోనో అస్సలు సంబంధం లేదు. నేను తల్లిగా నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. ఒక బిడ్డను పెంచి పోషించే బాధ్యతలో ఉన్నప్పుడు, మునుపటి శరీర ఆకృతి కోసం పాకులాడటం నా దృష్టిలో అనవసరం” అంటూ కుండల బద్దలు కొట్టేసింది.

ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న ఈ బాడీ షేమింగ్ అసహ్యంగా ఉందన్న స్వరా.. తాను ఫిట్‌నెస్‌కు వ్యతిరేకం కాదని, కానీ డెలివరీ తర్వాత మహిళలపై అందం పేరుతో చేసే మానసిక దాడిని మాత్రం సహించబోనని చెప్పుకొచ్చింది.

నెటిజన్ల మద్దతు..

ఇక స్వరా భాస్కర్ చేసిన ఈ కామెంట్స్‌కు నెట్టింట గట్టి మద్దతే లభిస్తుంది. ముఖ్యంగా తల్లులైన మహిళలు స్వరాకు సపోర్ట్‌గా నిలబడటం విశేషం. “ఒక తల్లి మనోభావాలను గౌరవించాల్సింది పోయి, ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు” అంటూ ట్రోలర్స్‌కు చురకలు అంటిస్తున్నారు స్వరా ఫ్యాన్స్.

మొత్తానికి బాడీ షేమింగ్ చేసే వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చి మరోసారి తనెంటో ప్రూవ్ చేసుకుంది ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్!

also read:త్రిషను కావాలనే పక్కన పెట్టారా? ఆ ఆడియో లాంచ్‌లో అసలు ఏం జరిగింది? షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×